విభూతి యోగం వరకూ ద్వివిధమైన భక్తి మార్గాన్నీ వర్ణిస్తూనే వచ్చాడంటారు భగవత్పాదులు. ఆయన దాని నీ అధ్యాయాని కవతారిక వ్రాస్తూ ఏమని వ్యాఖ్యానిస్తున్నారో చూడండి. ద్వితీయాధ్యాయ ప్రభృతిషు విభూత్యం తేషు. అధ్యాయేషు పరమాత్మనో బ్రహ్మణః అక్షరస్య విధ్వస్త సర్వోపాధి విశేషస్య ఉపాసన ముక్తమ్. రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగం మొదలుకొని పదియవదైన విభూతి యోగం వరకు నామరూపాదులైన ఏ ఉపాధులూ లేని అక్షరమైన పరమాత్మ తాలూకు ఉపాసన ఎలా చేయాలో వర్ణించింది గీత. సర్వయోగైశ్వర్య సర్వజ్ఞాన శక్తిమ త్సత్త్వోపాధే రీశ్వరస్య తవచ ఉపాసనం తత్ర తత్రోక్తం. అలాగే ఆ అధ్యాయాలలోనే అక్కడక్కడా సర్వజ్ఞాన సర్వ శక్తి మత్వాది ఉపాధులతో కూడిన ఈశ్వరుడవైన నీ ఉపాసన కూడా వర్ణించింది. పోతే ఇక విశ్వరూపాధ్యాయేతు. విశ్వరూప సందర్శనమనే పదకొండవ అధ్యాయంలో. ఐశ్వరమాద్యం సమస్త జగదాత్మ రూపం విశ్వరూపం త్వదీయం దర్శిత ముపాసార్ధమేవ త్వయా. ఈశ్వరుడవైన నీకు సంబంధించిన సమస్త జగత్తునూ వ్యాపించిన నీ విశ్వరూపం కూడా ప్రదర్శించావు మాబోటి వాళ్లు ఉపాసించటానికే. తచ్చ దర్శయిత్వా ఉక్త వానసి - అంతేకాక విశ్వరూపాన్ని చూపి నాకొక మాట చెప్పావు. ఏమని. మత్కర్మకృత్ మత్పరమః అని. నాకోసమే చేస్తుండు ఏ పని చేసినా అని గదా నాకు సలహా ఇచ్చావు. అతః అనయోరుభయోః
Page 480