ఆఖరుకు బ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవాలన్నా సగుణోపాసనా నిర్గుణోపాసనా అని దాన్ని కూడా ఉపాసన అనే వ్యవహరించింది.
అయితే వ్యాసమహర్షి మాత్ర ముపాసనా విద్య అనే వాటికి మారుగా భక్తి అనే మాట బాగా వాడుక చేసినట్టు కనిపిస్తుంది. శబ్ద వ్యుత్పత్తిని బట్టి చూస్తే ఉపాసన అన్నా భక్తి అన్నా పెద్ద తేడా రాదు. ఉప దగ్గరగా ఆసన కూచోటమని శబ్దార్ధం. పరమాత్మ తత్త్వానికి మానవుడి మనస్సు దగ్గరగా కూచుంటే అదే ఉపాసన. భక్తి అన్నా అదే అర్థం. భజించటమే భక్తి. భజించటమంటే అంటి పట్టుకోటం. పరమాత్మనీ జీవాత్మ విడవకుండా పట్టుకొంటే అదే భక్తి. అలా పట్టుకోకపోతే విభక్తి. అలాంటప్పుడు పాసన అన్నా భక్తి అన్నా తేడా ఏముంది. భావమొకటే గదా. అందుకే మహర్షి దీనికి భక్తి యోగమని నామకరణం చేసినా అక్కడక్కడ భజతే అనే గాక ఉపాసతే అని కూడా మార్చి మార్చి ప్రయోగిస్తుంటాడు. రెండూ ఒకటేనని చెప్పటానికిదే నిదర్శనం మనకు.
మొత్తం మీద ఇలాటి భక్తి అనే సాధనంతోనే పట్టుకోవాలా భగవత్తత్త్వాన్ని మానవుడు. అది కూడా రెండు విధాలా భక్తి అనేది. ఒకటి అన్యం. మరొకటి అనన్యం. తత్త్వాన్ని పరోక్షంగా భజిస్తే అన్యం. అపరోక్షంగా భావిస్తే అనన్యం. ఇలా రెండు శాఖలుగా సాగుతూ వచ్చిందీ సాధన మార్గం మొదటినుంచీ భగవద్గీతలో. ద్వితీయాధ్యాయం నుంచీ దశమాధ్యాయమైన
Page 479