#


Index

భక్తి యోగము

కూడా కాదు. అనన్య భక్తి. ఈ మాట విశ్వరూపాధ్యాయం ముగించే ముందే సూచన చేశాడు వ్యాసభగవానుడు. భక్త్యా త్వన న్యయా అని. న వేద యజ్ఞాధ్యయనైః అని మిగతా వన్నీ కొట్టి వేసి అనన్య భక్తి ఒక్కటే పరమాత్మను పట్టుకొనే ఏకైక సాధన మని కుండబద్దలు కొట్టినట్టు చాటి చెప్పాడాయన.

  భక్తి అనే మాట భగవద్గీతలో మాత్రమే తరుచుగా వినిపిస్తుంది. గీతకు మూలభూతమైన ఉపనిషద్వాఙ్మయంలో ఎక్కడా ఈ మాట మనకంతగా తటస్థ పడదు. అక్కడ మన చెవిలో పడేది తరుచుగా ఉపాసన అనే శబ్దం. భక్తికి మారుగా ఉపాసన అనే శబ్దమే కనిపిస్తుంటుందక్కడ. అది సగుణమైతే సగుణోపాసన - నిర్గుణమైతే నిర్గుణోపాసన. ఇవి రెండూ బ్రహ్మ విషయం. మరి బ్రహ్మోపాసన కంటే తగ్గు రకమైతే దేవతోపాసన అంటారు దాన్ని. అంతకన్నా తక్కువది కర్మాం గోపాసన. దేనికి తగిన ఫలం కూడా దానికున్నది. అది కూడా ప్రత్యేకంగా బోధిస్తా యుపనిషత్తులు. ఇంకా ఒక విషయమేమంటే ఉపాసన అనేగాక విద్య అని కూడా ఒక పేరుంది దీనికి. విద్య అంటే ఇది బ్రహ్మ విద్య కాదు. ఆయా దేవతలకు చెందిన జ్ఞానం. దేవతా జ్ఞానమని పేర్కొంటారు దీన్ని భగవత్పాదులు. ఇవి ఒకటి గాదు. చాలా ఉన్నాయి. ఉద్దీథ విద్య - మధు విద్య - శాండిల్య విద్య – పర్యంక విద్య – పంచాగ్ని విద్య - ఇలా ఎన్నో పేర్కొన్న దుపనిషత్తు.

Page 478

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు