12. భక్తి యోగము
మొత్తం మీద అర్జునుడితో పాటు మనం కూడా విశ్వేశ్వరుణ్ణి చూడకుండానే విశ్వరూపాన్ని చూస్తూ వచ్చాము. ఇప్పుడూ చూస్తూనే ఉన్నాము. కాని విశ్వేశ్వరుణ్ణి చూడకుండా పోతే ఆయన స్వరూపమూ అర్థం కాదాయన చూపే ఈ విశ్వరూప మర్ధం కాదు. ఎప్పటికైనా ఆయన గారి స్వరూపమేమిటో ముందుగా గుర్తిస్తేనే అటు స్వరూప జ్ఞానమూ కలగుతుంది. దాని దృష్ట్యా చూచామంటే ఇదంతా దాని విభూతే ననీ అనుభవానికి వస్తుంది. మరి ఆ విశ్వేశ్వరుణ్ణి చూచే మార్గమేమిటి దానికి తగిన సాధనమేమిటని అడిగితే అది బయట పెట్టటానికే వచ్చిందిప్పుడీ అధ్యాయం. ఆ సాధనమేదో గాదు భక్తి. భక్తి అంటే మామూలు భక్తి
Page 477