#


Index

విశ్వరూప సందర్శన యోగము

మామేతి అనటంలో జ్ఞానయోగమూ అన్నిటికీ సంగమ స్థానమిది. అందుకే ఇది సారభూతమైన శ్లోకమని భగవత్పాదులంతగా ప్రశంసించటం. ఇంతకూ కర్మాద్యనుష్ఠానాలు లేవంటూనే అవునని సిఫారసు చేస్తున్నది గీత. నవేద యజ్ఞాధ్య నైః అని నాహం వే దై ర తపసా అని పదే పదే కాదని త్రోసిపుచ్చిందా లేదా ఇంతకు ముందు. అదే ఇప్పుడీ శ్లోకంలో ఆచరించమని అనుమతి ఇస్తున్నది. ఇది ఎలా సమన్వయించుకోవాలని ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఈ శ్లోకంలోనే ఇమిడి ఉంది. మత్ మత్ అనటం ద్వారా అది సూచిస్తూన్నాడు గీతాచార్యుడు. నీవేది చేసినా చేయి అది దాని పాటికది ఉందని చూడకు. అది దేనిలో పర్యవసిస్తున్నదో అది గుర్తించు. అది మత్ - అంటే ఆత్మ చైతన్యం. అదే నీవు మనోవాక్కాయాలతో చేసే ప్రతిపనిలో అనుస్యూతంగా వస్తుంటుంది. కర్మా నేను చేసేదే. భక్తీ నేను చేసేదే. సమాధీ నేనవలంబించేదే. జ్ఞానమూ నేను పాటించేదే. నేననే భావం లేకుండా దాని స్పర్శ లేకుండా నాదనేది లేదు. ఈ నాదంతా నేను లోనుంచే వచ్చి చివరకా నేను లోనే లయమవుతున్నది. మధ్యలో సాగుతున్నప్పుడు కూడా నేనును అంటిపట్టుకొనే ఉంటున్నది. ఇదుగో ఈ నేననే స్ఫురణే స్పృహే ఆత్మ అన్నా బ్రహ్మమన్నా. మామేతి అంటే ఆ నేననే భావాన్నే నీవు అంచెల వారిగా సాధన చేస్తూ పోతే ఎప్పటికైనా అందుకోగలవు. కొత్తగా అందుకోటం కూడా కాదు. అంతకు ముందు

Page 475

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు