జీవితంలో పాటించి మానవుడది ఎలా అందుకోవాలో మొత్తం విషయమంతా కూడగట్టి భగవానుడీ కడపటి శ్లోకంలో మనకందిస్తున్నా డంటారు.
ఏమిటలాటి సారభూతమైన విషయం. ఏదోగాదు. మత్కర్మకృత్. నన్ను మనసులో పెట్టుకొని నాకోసమే చేస్తుండు ఏపని చేసినా. మత్పరమః ఆ చేయటంలో కూడా ఏదో మొక్కుబడి తీర్చినట్టు స్వార్ధబుద్ధితో గాక నీ జీవితానికి పరమార్ధం అందుకోసమే బ్రతుకుతున్నానను కొంటూ చేయి. మద్భక్తః - అన్ని విధాలా నా భావమే తలపోస్తూ నన్నే అంటి పట్టుకొంటూ ఉండు. అలా భజిస్తూ ఉన్నప్పుడు సంగవర్జితః - ధనపుత్ర మిత్ర కళత్ర బంధు వర్గాలతో వల్లమాలిన సాంగత్యం పెట్టుకోకు. అలాగే నిర్వైరః సర్వభూతేషు. మానవులనే గాక ఏ ప్రాణికైనా హాని తలపెట్టక సుహృద్భావంతో సానుభూతితో చూడటం నేర్చుకో. నీవనే గాదర్జునా యస్సమామేతి - ఎవడైనా జీవితంలో నేను చెప్పిన ఈ మార్గంలో నడుచుకొంటే చాలు. వాడు జ్ఞాని అయి ఎప్పటికైనా నన్ను చేరగలడని భగవానుడిచ్చే హామీ.
ఇందులో అన్ని మార్గాలూ కలిసి వచ్చాయి మనకు. మత్కర్మకృత్ మత్పరమ అనటంలో కర్మయోగమూ. మద్భక్తః అనటంలో భక్తి యోగమూ సంగవర్జితః నిర్వైరః అనటంలో సమాధి యోగమూ
Page 474