దానికే అనన్య భక్తి అని నామాంతరం. పరమాత్మ నన్యంగా చూడడప్పుడు. అనన్యంగా తన స్వరూపంగానే దర్శిస్తాడు. అది ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు భాష్యకారులు - సర్వైరపి కరణై ర్వాసు దేవా దన్య న్నో పలభ్యతే యయా సా అనన్యా భక్తిః - మనః ప్రాణచక్షురాది కరణాలతో దేనితో గ్రహించిన ఏ పదార్థమైనా సచ్చిదాత్మకమైన పరమాత్మ కన్యంగా గోచరించ కూడదు. అదీ అనన్య భక్తి అంటే. అలాటి అనన్యమైన ఆత్మజ్ఞానం నీకుదయిస్తే చెప్పు. జ్ఞాతుం. పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకొన్న వాడవు. ద్రష్టుం దాన్ని దర్శించినవాడవు. ప్రవేష్టుంచ పరమాత్మలోనే ప్రవేశించి దానితో ఐక్యం చెందిన వాడవూ అని నేను నీకు హామీ ఇవ్వగలను. అలా కాని నాడు నీవు ఎంత భక్తుడవైనా జ్ఞానివైనా నాకు దూరస్థుడవేనని తెగేసి చెబుతున్నాడు భగవానుడు. ఇది అర్జునుడికనే గాదు. ఆ మిషతో మన కందరికీ.
మత్కర్మకృన్మత్పరమో - మద్భక్త స్సంగ వర్జితః
నిర్వైర స్సర్వభూతేషు యస్సమామేతి పాండవ - 55
ఇది కూడా అర్జునుణ్ణి నెపంగా పెట్టుకొని అందరికీ చేస్తున్న గొప్ప హెచ్చరికే. ఇది ఎంత గొప్పదంటే భగవత్పాదులిలా వ్రాస్తున్నారు. అధునా సర్వస్య గీతా శాస్త్రస్య సారభూతః అర్థః నిశ్రేయసార్థః అనుష్టేయత్వేన సముచ్చిత్య ఉచ్యతే. గీతాశాస్త్రం లోకానికి బోధిస్తున్న సారభూతమైన అంశమేదో లోకానికి నిఃశ్రేయసాన్ని అందజేసే మార్గమేదో అది ఎలా
Page 473