జీవుడెప్పటికైనా ఆత్మను దర్శించవలసింది. మరెలాగా. తాము ఆత్మకు వేరుగా ఉన్నంత వరకూ దాన్ని దర్శించలేవు. దాని స్వరూపంగానే మారిపోతే మాత్ర మాకళించకోగలవు. ఇదీ పరిష్కారం. సరిగా కేనోపనిషత్తు కధ లోని సంకేత మిదే సత్యాన్ని మనకు చాటి చెబుతున్నది. దేవతలు కొలువు తీరి ఉంటే ఏదో అపురూపమైన పదార్ధం దూరాన కనిపించింది. అదేమిటో తెలుసుకొని రమ్మని దేవేంద్రుడు పంపితే అగ్నీవాయువూ ఇద్దరూ కూడా వెళ్లి తెలుసుకోలేక పరాభవం పాలయి వచ్చారు. చివరకు దేవేంద్రుడే వెళ్లి చూడబోతే అది అసలే కనిపించకుండా మాయమవుతుంది. ఏమిటా ఈ చిత్రమని అతడు ధ్యాన ముద్రలో ఉండిపోతే ఒక మెరపులాగా మెరుస్తూ ఒక స్త్రీమూర్తి దర్శనమిస్తుంది. అమ్మా అది ఏమిటవి అడిగితే అదే బ్రహ్మం - నన్ను పట్టుకో. నా సహాయం లేకుండా అది నీకు కనపడదు. నేనాయనను చేర్చే విద్యాస్వరూపిణిని అని సలహా ఇస్తుంది. ఏమి చెబుతున్నదిప్పుడీ కధ. మనఃప్రాణాలు రెండూ ఆత్మకు పాధులే. స్వతంత్రంగా చైతన్యం లేదు వాటికి. చైతన్యమున్నది జీవుడికే. వాడే ఇంద్రుడు. కాని వాడు కూడా నివిధ్యాసన సాగిస్తూ పోతే గాని ఆత్మజ్ఞాన ముదయించదు. కనుక దేవతలకు కూడా సుదుర్దర్శమంటే దేవతలెక్కడో ఉన్నారు దేవలోకాల్లో వారికర్థం కాలేదని కాదు. మానవుడి మనః ప్రాణాలకూ దుర్దర్శమది. వాటితో తాదాత్మ్యం చెందిన జీవుడికీ అతీతమే. అయితే ఈ జీవుడే నిర్వికల్పమైన ఆత్మాకార వృత్తితో చూడగలిగితే సుదర్శమేనని సాధన రహస్యం.
Page 471