#


Index

విశ్వరూప సందర్శన యోగము

  అసలు నీవేమిటి. దేవా అపి అస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః నీకంటే గొప్పవారను కొన్న ఇంద్రాది దేవతలు కూడా ఇలాటి నా విశ్వరూపం చూడాలని ఎప్పుడూ ఉబలాట పడతారు. ఉవ్విళ్లూరు తుంటారు. అయినా నీవు చూచినంత మాత్రం కూడా చూడటానికి నోచుకోలేదా దరిద్రులంటాడు.

  ఏమిటీ మాట. ఇంద్రాదులకు కూడా చూపని రూపం భగవాను డర్జునుడికి చూపాడా. వారికి కూడా లేని దర్శన సామర్ధ్యమర్జునుడి లాంటి మానవ మాత్రుడి కుండా. ఉంటే ఎందుకు భయపడ్డాడు. ఎందుకు భంగపోయాడు. కాదు. ఇందులో ఏదో అంతరార్థముంది. అదేదో తెలుసుకొందాం. ఇదం ద్ర ఇది చూచేవాడెవడో వాడింద్రుడు. జీవుడని అర్థం. జీవుడేగా ఎప్పుడూ ఈ ప్రపంచాన్ని చూస్తూ కూచున్నాడు. పోతే వాడికి కొంత మంది దూతలున్నారు. అవి పన్నెండు. మనస్సూ ప్రాణం చక్షురాదులైన జ్ఞానేంద్రియాలైదు - వాగాదులైన కర్మేంద్రియాలైదూ వెరసి పన్నెండు. ఈ ఇంద్రియాలకే దేవతలని పేరు. ఆయా విషయాలను గ్రహించేవీ ప్రకాశింప చేసేవీ గనుక దేవతలవి. దీవ్యతీతి దేవః ప్రకాశించేవి స్ఫురింప జేసేవని అర్థం. అందులోనూ ముఖ్యంగా అంత రింద్రియాలైన మనస్సూ ప్రాణమే ప్రధానమైనవి. అవే వాయ్వగ్నులు. ప్రాణం వాయువుకు సంకేతమైతే అగ్ని మనస్సుకు సంకేతం. ఇవి రెండూ ఆత్మ చైతన్య స్థాయి కెదిగి దాన్ని అందుకోలేవు. వీటి ద్వారానే గదా

Page 470

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు