#


Index

విశ్వరూప సందర్శన యోగము

ఎప్పటికో ఒకప్పటికి అసతో మా సద్గమయ అన్నట్టు సత్యమైన భగవత్తత్త్వానికే చేరుస్తుంది.

సుదుర్దర్శ మిదం రూపం దృష్టవా నసి యన్మమ దేవా అప్యస్య రూపస్య - నిత్యం దర్శన కాంక్షిణః - 52

  ఇదీ అర్జునుడి పరిస్థితి ఇప్పుడు. భగవానుడతనికి మనకు మల్లేనే మానవో పాధిలో కనపడాలి. దానిని మించి కనపడితే తట్టుకోలేడు. జ్ఞానమనే దివ్యదృష్టి ఉన్నా అది భౌతిక ప్రపంచ మాత్ర పరిమితమే. అభౌతికమైన స్థాయి కెదిగి చూచేటంత స్తోమత లేదు దానికి. అది అందరికీ సుదుర్దర్శ మైనదే ఆ రూపం. ఏమాత్రమూ అంతు పట్టేది కాదు. ఎవరికా అంతు పట్టనిది. మానవులకనే గాదు. పశుపక్ష్యాదులకని చెప్పినా చెప్పవచ్చు ఇక్కడ. వాటికి వాసనా జ్ఞానమే దృష్టి. వివేక జ్ఞానమున్న మానవుడికే అగమ్యమైతే అది కూడా లేని తిర్యక్కుల కేమి బోధపడుతుంది. కనుక మనకు దుర్దర్శమైతే వాటికి సుదుర్దర్శం. ఎంత చూడాలను కొన్నా చూడలేవు. ఇది మనం కాదు. భగవానుడే చాటి చెబుతున్నాడు అర్జునుడు నెపంగా మనబోటి మానవకోటి కంతా. దృష్ట వానసి యన్మమ. నీవీ మాత్రమైనా నా విశ్వరూపం చూచావంటే అదే మహా భాగ్యమనుకో. అది కూడా నీప్రజ్ఞతో గాదు. నా అనుగ్రహంతో. అది కూడా నీ స్వప్రయత్నం లేకుంటే పనిచేయదని నీవు గుర్తించటానికే నీకలా చూచినా భీతాహ మేర్పడటం.

Page 469

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు