#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  అదే ప్రస్తుత మిక్కడ కూడా అర్జునుడి వ్యవహారంలో చూపుతున్నాడు మహర్షి దృప్ట్వేదం మానుషం రూపం తవసౌమ్యం స్వామీ మానవ శరీరం ధరించి నీవు నాకు సౌమ్యమైన ఆకారంలో కనిపిస్తుంటే. ఇదానీమస్మి సంవృత్త స్సచేతాః - ఇదుగో ఇప్పుడు నా మనసు కుదుట బడ్డది. ఆనందంగా ఉన్నది. అంతే కాదు. ప్రకృతిం గతః యధాస్థితికి చేరుకొన్నాను. ఇంత వరకూ నా మనసు నామనసులో లేదు. నా స్వభావమే నాకు దూరమయి పోయినేనెక్కడున్నానో నాకే తెలియదు. ఇప్పుడే నాకు ప్రాణాలు లేచి వచ్చినంత ఆనందంగా ఉందంటాడు. ఇక్కడ మానుషం రూపమంటున్నాడు గమనించండి. మానవుడెప్పుడూ ఈశ్వరుడు కూడా తన కర్థమయ్యే రూపంలో కనిపిస్తేనే సంతోషిస్తాడు. తన కతీతమైన దివ్య శరీరంగానో అశరీరంగానో దర్శనమిస్తే భరించలేడు. భయపడతాడు. ໙໐໖ Man likes to see god in his from ఈశ్వరుణ్ణి. అందుకే తన మనస్తత్త్వాని కనుగుణంగా గుణాతీతమైన తత్త్వాన్ని గుణాధీనంగా మార్చుకొని చూస్తూ తృప్తి పడుతుంటాడు. అదే రామకృష్ణాద్యవతారాలూ. శివవిష్ణ్వాది విగ్రహాలూ. అవి కేవలం పాంచ భౌతికమైనా భౌతికంగా చూడక వాటికి దివ్య త్వ మాపాదించి ఆరాధిస్తుంటాడు. అలాగైతే గాని తనకు దగ్గరగా చూచుకోలేడు. చూచి ఆనందించలేడు. అది వీడి బలమీనత అనండి. బలమనండి. ఏమైనా అనండి. అయితే అదైనా మంచిదే ఒక విధంగా. తన పాటికది అనృతమైనా

Page 468

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు