#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

పరమాత్మ మన దృష్టి భేదాన్ని బట్టి రెండు విధాలుగా ఈ విశ్వాన్ని మనకు చూపుతున్నా డనుకోవచ్చు. అజ్ఞాన దృష్టితో చూస్తే భయంకరంగా కనిపిస్తాడు. జ్ఞానదృష్టితో చూస్తే ఆనందదాయకంగా గోచరిస్తాడు. ఇదీ మహర్షి కల్పించిన ఈ విశ్వరూప కల్పనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సంకేతం.

దృష్టేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన
ఇదానీ మస్మి సంవృత్తః స చేతాః ప్రశృతిం గతః - 51


  ఇప్పుడీ దృష్టితో చూస్తే అర్జునుడనే వాడే స్థితిలో ఉన్నా డంటారు. ఆనందించవలసింది పోనిచ్చి విశ్వరూపాన్ని చూచి భయపడి ఉపసంహరించమని వాపోతున్నాడు. కాబట్టి మనమందరమూ ఇప్పుడే స్థితిలో ఉన్నామో ఆస్థితిలోనే ఉన్నాడు. తాను విశ్వేశ్వరుడయి చూడటం లేదు విశ్వాన్ని. అంటే ప్రత్యగాత్మ ననుకోటం లేదు. అందుకే విశ్వం భయావహంగా మారింది. మనకూ ఇప్పుడీ ప్రపంచమంతేగా. అనుక్షణమూ భయోత్పాదకమే ఈ సంసారం. ఏదో ఒక మహాశక్తి సృష్టించి దీన్ని మనముందు పారేసింది. దీనితో ఒంటరిగా తలపడి సుఖం లేదు. సుఖంగా బ్రతకాలంటే మనకతీతంగా ఉన్న ఆ మహాపురుషుణ్ణి ఆరాధించి ఆయన ప్రసన్నుడైతే మనకిది అనుకూలం చేసి చూపుతాడని గదా మనందరి నమ్మకం. అంటే మనం స్వరూపాన్ని గుర్తించకుండా దాన్ని అలాగే ఉంచుకొని దీన్ని ఎవడో మనకు సౌఖ్యావహంగా మార్చి చూపాలన్న మాట. యేయధామా ప్రపద్యంతే అనే న్యాయాన్ని బట్టి అలాగే మనకు మేలు చేయవచ్చు ఆ పరమాత్మ. అప్పుడెక్కడ లేని భక్తి ప్రపత్తు లేర్పడతాయి.

Page 467

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు