#


Index

విశ్వరూప సందర్శన యోగము

  మన దృష్టి ఇప్పుడు మన స్వరూపాన్ని పూర్తిగా చూడటం లేదు. సంసారాన్ని పూర్తిగా చూడటం లేదు. పూర్తిగా చూస్తే విశ్వేశ్వరుడు గానే మనకు మనం కనిపించే వాళ్లం. అలా చూడక జీవాత్మగా చూస్తున్నాము. అది కూడా కాదేమో. ఇంకా క్రింది స్థాయికి దిగజారి దేహాత్మగా చూచినా చూడవచ్చు. అప్పుడు మనం ప్రత్యగాత్మ అనే సంగతి మరచిపోయాం. అలా మరచి చూస్తే విశ్వం మనకు మన విభూతిగా మన విస్తారంగా ఎలా కనిపిస్తుంది. మన దృష్టి మారినట్టే ఇది కూడా విభూతిగా గాక నికృష్టమైన సంసారంగానే దర్శనమిస్తున్నది. ఇస్తే దీన్ని జీర్ణం చేసుకోలేక ఎప్పుడేది వచ్చి నెత్తిన పడుతుందో నని హడలి చస్తుంటాం. మనకెప్పుడూ మనమూ దూరమే. మనకీ విశ్వమూ దూరమే. అంటే విశ్వేశ్వరుడికి దూరమై విశ్వాన్ని చూస్తున్నాము. కనుక ఇది విషాదం గాక వినోదమెలా అవుతుంది. విశ్వేశ్వరు లమే ననుకొని విశ్వాన్ని చూచామంటే ఇది మన విభూతే ననే సత్యం బయటపడుతుంది. కాబట్టి భయపడం. బాధపడం. ఇప్పుడర్జును డెందుకు భయపడ్డాడో అర్థమయిందా. అర్జునుడెవడో కాదు మనమేనని గదా పేర్కొన్నాము. మన మర్జునులం. మనకున్న జ్ఞానమే దృష్టి. అది మనం ప్రత్యగాత్మ అనుకొని ప్రపంచాన్ని చూస్తే దివ్యదృష్టి. అప్పుడు భయం లేదు. మన విభూతే అది. అలాకాక జీవాత్మ లేదా దేహాత్మ అనుకొని చూస్తే అదే మర్త్య దృష్టి. అప్పుడదే సంసారంగా కనిపించి భయోత్పాదకంగా మారుతుంది. కనుకనే కృష్ణుడనే

Page 466

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు