#


Index

విశ్వరూప సందర్శన యోగము

తప్పు అర్జునుడిదే. నీ విశ్వరూపం చూడాలని ఉంది చూపమని అతడడిగితే చూపాడు. చూడలేను మానేయమంటే మానేశాడు. మళ్లీ నీ అసలు రూపమే చూపమని అడిగితే చూపుతున్నాడు. ఇందులో ఆయన తప్పేముందంటారు. డిమాండు కొద్దీ సప్లై అన్నట్టు అర్జునుడే దడిగితే అది చూపుతూ వచ్చాడు. యే యధామాం ప్రపద్యంతే తాంప్త థైవ భజామ్యహమని ఇంతకు పూర్వమే చెప్పాడు గదా భగవానుడు. దాని కనుగుణంగానే ఉందిప్పుడాయన వ్యవహారం.

  అసలిక్కడ అర్జునుడనీ కాదు. కృష్ణుడనీ కాదు. ఆయన తన విశ్వరూపం చూపటమనీ గాదు. దాన్ని మరలా మాఫీ చేయటమనీ కాదు మనం చూడవలసింది. అదంతా ఒక నాటకం. మహర్షి కల్పించిన ఒక గొప్ప నాటకం. దాని వెనకాల దాగి ఉన్నదొక గొప్ప సత్యం. అదీ మనమిక్కడ గ్రహించవలసింది. ఇది దానికి దోహదం చేసే ఒక సంకేతం మాత్రమే. అదేమిటంటే అసలున్నది పరమాత్మే. అది నీనా ఆత్మ స్వరూపమే. అది విస్మరించే సరికి శరీరం మేరకే తగ్గి పోయి ఆ మేర కొక విశ్వాన్ని మనం సృష్టించుకొన్నాం. అది మన అజ్ఞానం వల్ల మనమే సృష్టించుకొన్నామని తెలియక దీని కొక సృష్టి కర్త ఉన్నాడు వాడీశ్వరుడని ఒక ఈశ్వరుణ్ణి కూడా కల్పించుకొన్నాం. వాడు కూడా ఎక్కడో మన కతీతంగా ఉంటే తృప్తి లేక మన తృప్తి కోసం వాడికీ ఒక శరీరం కల్పించి మన స్థాయికి దించి చూచుకొంటున్నాం. ఈ చూస్తున్న వాడే అర్జునుడు. వీడు తన

Page 464

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు