#


Index

విశ్వరూప సందర్శన యోగము

విశ్వమే చూపు నాకు చూడాలని ఉందని వేడుకోడు. విశ్వమైనా అది ఆత్మ తాలూకు విభూతేనని భయపడకుండా చూచి వినోదించేవాడు. అతనిలో అంతర్గతంగా ఉన్న ఈ దౌర్బల్యాన్ని గుర్తించే సర్వజ్ఞుడైన పరమాత్మ ఏమంటున్నాడో వినండి.

  మాతే వ్యధా మాచ విమూఢ భావః - నీకు భయం లేదర్జునా. బాధ పడకు. నీ భయానికీ బాధకూ కారణమేదో గాదు నీ విమూఢత్వమే. అజ్ఞానమే. ఆత్మ అంటే ఏమిటో సరియైన అవగాహన లేకపోవటమే. అందుకే దృష్ట్వా రూపం ఘోరమీ దృఙ్మమేదం. ఘోరమైన ఇలాటి నారూపాన్ని చూచి భయపడ్డావు. బిత్తరపోయావు నీవు. అజ్ఞానివి కనుకనే ఇలాటి భీతాహ మేర్పడింది నీకు. జ్ఞానివే అయితే ఇలా హడలిపోవు. వ్యపేత భీః ప్రీతమనాః ఇక ఏ భయమూ పెట్టుకో నక్కర లేదు. నిర్భయంగా ఉండు. మనస్సు నిర్మలంగా స్తిమితంగా ఉంచుకో. పునస్త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య. మళ్లీ ఆరూపమే నీకు చూపుతున్నాను చూడు. అది నీకు దారుణంగా కనిపించి ఉండవచ్చు. ఇది అలా కాక సౌమ్యమైన రూపంలో దర్శనమిస్తుంది. జంకు కొంకు లేక హాయిగా చూడు.

Page 462

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు