Index
విశ్వరూప సందర్శన యోగము
మాతే వ్యధా మాచ విమూఢ భావో
దృష్ట్యా రూపం ఘోర మీ దృఙ్మమేదం
వ్యపేత భీః ప్రీత మనాః పునస్త్యం
తదేవమే రూప మిదం ప్రపశ్య - 49
ఇప్పుడర్జును డలాటి ఆత్మజ్ఞానం సంపాదించా డంటారా లేదంటారా. సంపాదించే ఉంటే నాకీ మూర్తితో నీవు కనపడవద్దు. చూడలేనని మొరపెట్టడు. అలాగే నీవింత వరకూ చూపుతూ వచ్చిన ఈ భయానక దృశ్యాన్ని నేను చూడలేను నీ విశ్వరూపాన్ని ఉపసంహరించమని వాపోడు. అమాయికుడు కాకపోతే అర్జునుడా మూర్తితో కనపడక పోయినా మరొక మూర్తితోనైనా కనపడతాడుగా భగవానుడు. విష్ణుమూర్తి అదైతే కృష్ణమూర్తి. ఇదీ. ఏదైతేనేమి. మూర్తి మూర్తే. ఒకటి త్రివిక్రమం. మరొకటి వామనం. ఇంతే తేడా. మూర్తి లేకుండా పోయిందేముంది. అలాగే ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించినా ఈ విశ్వరూప మెక్కడికి పోయింది. అది చూడకపోయినా ఇది చూడక తప్పదుగదా జీవితాంతమూ. అప్పటికి నీవేమి సాధించినట్టు. సంసారమనే సమస్య నేమి పరిష్కరించి బయటబడ్డట్టు. అసలైన పరిష్కార మార్గమేదో ఏమాత్రమూ అర్థం కాలేదర్జునుడికి. కాబట్టి అజ్ఞుడే అతడు ప్రాజ్ఞుడు కాదు. ప్రాజ్ఞుడే అయితే ఒకమూర్తితో గాక మరొక మూర్తితో దర్శనమివ్వమని అడగడు. అమూర్తమైన ఆత్మనే దర్శించాలని కోరేవాడు. అలాగే ఆ విశ్వరూపం కాదు దాన్ని వెనక్కు తీసుకొని నా కలవాటయిన
Page 461
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు