#


Index

విశ్వరూప సందర్శన యోగము

పరిష్కరించుకోటానికి పనికి రావని మాత్రమే మా సమాధానం. ఆత్మజ్ఞానం వల్లనే మోక్షమని చెబుతున్నప్పుడు వేదధ్యాయనాది కర్మలు చేస్తానంటా వేమిటి నీవు. కర్మ జ్ఞానం కాదుగదా. పరమాత్మ ఎలా ఉన్నాడో అలా పట్టుకొనేది జ్ఞానం. పరమాత్మ నిరాకారం వ్యాపకం నిశ్చలమైన తత్త్వం. కర్మ చలనాత్మకం సోపాధికమైన సాధనం. సాధ్యాన్ని బట్టి గదా సాధన ముండవలసింది. అలాంటి సాధనం జ్ఞానమే అవుతుంది. అంతే కాదు. పరమాత్మ లాగ తదాకారమైన జ్ఞానం కూడా సామాన్య రూపం. సర్వత్రా వ్యాపించిన స్ఫురణ అది. సర్వత్రా అన్నప్పుడు సామాన్యమది. విశేష రూపం కాదు. కర్మ విశేషాత్మకం. యజ్ఞం దానం కాదు. దానం తపస్సు కాదు. దేని పాటికదే. ఏ ఒక్కటీ మిగతా వాటన్నిటినీ వ్యాపించ లేదు. లేదు గనుకనే అది విశేషం. విశేషమెప్పుడూ ఒకదాని కొకటి విరుద్ధం. అంతేగాక యజ్ఞతపో దానాది క్రియలన్నీ విషయాలు Objects మన జ్ఞానానికి. విషయమైతే అవి ఆత్మ ఎలాకాగలవు. ఆత్మ విషయం కాదు. విషయి Subject యజ్ఞాదులన్నీ మన జ్ఞానానికి విషయాలే గాని విషయి ఎలా అవుతాయి. విషయి కావాలంటే అది జ్ఞానమే అయి ఉండాలి. ఆత్మ ఎలా జ్ఞాన స్వరూపమో ఆత్మా కార వృత్తి కూడా జ్ఞానమే కాబట్టి దాన్ని అదే అనుభవానికి తెచ్చుకోగలదు. జ్ఞేయమైన యజ్ఞయాగాది క్రియలు గావు. కనుకనే అవి ఏవీ సాధనాలు కావని చాటవలసి వచ్చింది.

Page 460

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు