ఉన్నాయి యజ్ఞాలెక్కడ ఉన్నాయి. వాటి అధ్యయ నాని కర్ధమేముంది. దాన ధర్మాలేమిటి. ఆయా కర్మానుష్ఠానా లేమయ్యాయి. ఉగ్రమైన తపస్సు లేమయ్యాయి. న వేదయజ్ఞాధ్యయనైః - నాలుగు వేదాలూ వర్ణించి గొప్ప ఘనపాఠి అయ్యానని కీర్తి తెచ్చుకొన్నా ప్రయోజనం లేదు. ఆ వేదాలు విధించాయని చెప్పి వాజపేయ జ్యోతి ష్టోమాది యాగా లెన్ని కష్టపడి అనుష్ఠించినా సుఖం లేదు. నిత్య నైమిత్తాకాదులైన ఎన్ని సత్కర్మ లాచరించినా లాభం లేదు. అగ్నిహోత్రాది శ్రాతకర్మలు గాని దారుణమైన చాంద్రాయణ సాంతపనాది తపశ్చర్యలు గాని ఎన్ని పాటించినా అర్థం లేదు. అందులో ఒకటి కూడా నీకు పనికి రాదు. ఏవం రూప శ్చ క్య అహం ద్రష్టుం నా స్వరూపాన్ని ఉన్నదున్నట్టు గుర్తించటానికవి ఏవీ నీకు తోడ్పడవు. అన్నీ సత్కర్మలే కావచ్చు. శాస్త్రోక్తమైనవే కావచ్చు. అయినా తోడ్పడవు. ఫలితం లేదా అంటే ఉంటుంది. వాటికి తగిన ఫలితం వాటికుంది. ఫలితమే లేకుంటే శాస్త్రమదే పనిగా ఎందుకు విధిస్తుందీ యజ్ఞయాగాదులూ. దానధర్మాదులూ. కర్మణా పితృలోకః విద్యయా దేవలోకః అని వాటి కెలాటి ఫలముందో అది కూడా శాస్త్రం చెబుతూనే ఉంది కాదనటం లేదు.
మరి అలాంటప్పుడవన్నీ నిరర్ధకమని ఏ దృష్టితో అన్నారని ఇప్పుడు ప్రశ్న. వరమార్ధాన్ని అందుకోటానికి సంసార నమస్యను
Page 459