#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

మర్త్య దృష్టినే గాక దివ్యమైన జ్ఞాన దృష్టి కూడా ప్రసాదించాను. దాన్ని వృధా చేయక అది శ్రవణ మనన నిదిధ్యాసాదులతో పరిపాకానికి తెచ్చుకొని చూడండి. నేను మీ ఆత్మ స్వరూపంగానే మీకు దర్శనమిస్తాను. అంతేగాక ఆ దృష్టితో చూస్తూపోతే ఈ విశ్వం కూడా మీ విభూతి గానే మీకు సాక్షాత్కరిస్తుందని హెచ్చరిస్తున్నాడు మనలనందరినీ ఈ మాటల ద్వారా భగవానుడు.

న వేద యజ్ఞా ధ్యయనైర్న దానై
ర్నచ క్రియాభి ర్నత పోభి రుగ్రై
రేవం రూప శ్శక్య అహం నృ లోకే
ద్రష్టుం త్వద న్యేన కురు ప్రవీర - 48


  మరి ఇలాటి గొప్ప అవకాశం నేను నీకు కల్పించినా దాని విలువ గుర్తించ లేక ఊరక నీవు జార విడుచుకొన్నావా. నీవిక ఎన్ని రంగాలలో ఎంత కృషి చేసినా ఎంత మహనీయుడవని పించుకొన్నా ప్రయోజనం లేదు. నీవు వంచితుడవే. ఎందుకంటే ఆత్మజ్ఞానం తప్ప మరొక మార్గమే లేదు సమస్యా పరిష్కారానికి. సంసారమే మనకు సమస్య. అది అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం పోతే గాని అది తొలగిపోదు.

  అలాంటప్పుడేమిటి పరిష్కార మార్గం. మరొకటేదీ లేదు. ఉన్నదంతా నా స్వరూపమేనని గుర్తించే జ్ఞానమే. జ్ఞానమే నన్నప్పుడిక వేదాలెక్కడ

Page 458

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు