విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ముఖాన్ని చూపటానికే. తమకోసం కాదవి. మన అనుభవం కోసం. అలాగే పరమాత్మ తన్ను తాను చూచుకోటానికి అద్దంలాంటి తన మాయాశక్తిలో ప్రతిఫలించాడు. ప్రతిఫలించి పరమైన తన స్వరూపాన్ని అపరమైన విశ్వంగా ప్రదర్శిస్తున్నాడు. పరం దర్శిత మాత్మ యోగాత్తనే మాటకిదీ అంతరార్థం. అలాంటప్పుడు మనమీ అపరాన్నే చూస్తూ కుచుంటే లాభం లేదు. ఇది తమోమయం. తేజోమయం కాదు. తమస్సు విశ్వాన్నే చూపుతుంది గాని విశ్వేశ్వరుణ్ణి కాదు. విశ్మేశ్వరుణ్ణి చూడాలంటే తేజోమయం కావాలి దృష్టి. కారణమది తేజోమయం కాబట్టి. తేజస్సంటే చైతన్య ప్రకాశం. తేజోమయం విశ్వ మనం త మాద్యం అంటున్నది గీత. తేజోమయమైన దృష్టి కా పరమాత్మ తేజోమయమైన స్వరూపమే కనిపిస్తుంది. అంతే కాదు. ఆయన సృష్టించిన విశ్వం కూడా ఆయనలాగే తేజోమయంగా గోచరిస్తుంది. అంటే సంసారంగా గాక తదీయ విభూతిగా దర్శనమిస్తుంది. రెండూ ఒకే ఒక ఆత్మ చైతన్యంగా అనుభవానికి వస్తాయి. అదే అసలైన దివ్యదృష్టి. దృగ్దృశ్యాలు రెంటినీ ఏకం చేసి కేవలం దృగాకారంగా మార్చి చూచే దృష్టి. అలా కాదో. తమోమయమైన మర్త్య దృష్టి అది. దాన్ని వదలకుండా చూస్తే ఈశ్వరుడు దూరమై కేవల మాయన సృష్టించిన విశ్వమే కనిపిస్తుంది. అప్పుడది ఈశ్వర విభూతి కాదు. సంసార బంధం. భయానకం. ఇలాటి సంసార తాపత్రయం నుంచి ఇప్పుడు తప్పించుకోవాలంటే దీన్ని మాత్రమే చూస్తూ దీనితో తలమునకలయి సుఖం లేదు. అందుకోసమే మీకు
Page 457