విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
దృష్టే వాటిది. అంచేత మర్త్యమైన భౌతిక జగత్తే గోచరిస్తుంది. అభౌతికమైన దాని తత్త్వం అవగాహనకు రాదు. అది అవగాహన చేసుకో గలవాడు మానవుడే. వీడికుంది ఆ దివ్యదృష్టి. కాని అది ఉన్నా ఉపయోగించుకోలేక భౌతిక జగద్వ్యవహారానికి మాత్రమే అలవాటు పడితే వీడూ - చీమలూ దోమలతో సమానమే. యన్మేత్వ దన్యేన న దృష్ట పూర్వమంటున్నాడు భగవానుడు. ఏమిటి దాని కర్ధం. చీమలు దోమలలాగా నిన్ను సృష్టించ లేదు. నీకు దివ్యమైన దృష్టి ఇస్తే వాటి కది ఇవ్వలేదు నిను. కనుకనే అవి చూడలేవు. చూచి అర్థం చేసుకోలేదీ విశ్వరూపాన్ని, అన్యేన నదృష్ట పూర్వమంటే ఇదీ అర్థం. మానవుడే చూడగలడు. మానవుడే తన వివేక జ్ఞానంతో గ్రహించగలడు.
దేన్ని. సృష్టినా. సృష్టిని గాదు. సృష్టినే అయితే జంతుజాలం కూడా చూస్తూనే ఉన్నదీ విశ్వరూపాన్ని తమ శక్తి కొద్దీ. అదేగదా చెప్పామింతకు ముందు. అయితే ఏమి చూడాలి వీడు. విశ్వాన్ని కాదు వీడు చూడవలసింది. దివ్యమైన దృష్టి ఉన్నందుకు వీడు విశ్వరూపాన్ని మాత్రమే గాక ఇది ఎవడి రూపమో ఆ విశ్వేశ్వరుణ్ణి పట్టుకోగలగాలి. విశ్వరూప ప్రదర్శన విశ్వేశ్వరుణ్ణి దర్శించటానికే. దీని ప్రయోజన మదే. మన ముఖాన్ని మనం చూడలేము. అది చూడాలంటే అద్దంలో అది ప్రతిఫలిస్తే ఆ ప్రతిబింబం ద్వారానే ముఖముందనీ ఫలానా విధంగా ఉందనే స్ఫూర్తి కలుగుతుంది మనకు. ఇప్పుడీ అద్దం గాని ప్రతి ముఖంగాని ఎందుకున్నాయి. మన
Page 456