#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

  ఇప్పుడిక మాటాడుతున్నాడు వినండి భగవానుడు. ఇంతకు ముందొక మారు మాటాడాడు. ఆ తరువాత మరలా ఇప్పుడు మాటాడుతున్నాడు. అక్కడ అఖ్యాహిమేకో భవానుగ్రరూపః - ఇంత భయానకమైన ఆకారంతో కనిపిస్తున్నానే నీవు దయ్యమా భూతమా చెప్పమని అర్జునుడడిగితే జవాబిచ్చాడు. ఇక్కడ మరలా నీ రూపం నేను చూడలేను యధాపూర్వమైన రూపంతో నాకు కనపడమని కోరితే అలాగే నని తన కృష్ణ రూపమే ధరించి మాటాడుతున్నాడు. ఏమని. ఎంత పిచ్చి వాడవురా నీవు. మయా ప్రసన్నేన తవార్జునేన రూపం పరం దర్శిత మాత్మ యోగాత్. నీమీద ఎంతో అనుగ్రహ ముండి చూపాను నేను నీకా విశ్వరూపం. పరం రూపం అత్యద్భుతమైన రూపమది. అల్లాటప్పా వ్యవహార మనుకొన్నావా. ఇంతకూ నీవు నీ అమాయికత్వంతో దాన్ని చూడలేనని చేతులెత్తి ఒక గొప్ప సువర్ణా వకాశాన్ని జారవిడిచావు. పోగొట్టుకొన్నావు.

  ఈ మాటల్లో చాలా అంతరార్థముంది. ఆయన అనే ప్రతి మాటకూ రెండర్ధాలున్నాయి. బాహ్యార్థమలా ఉంచి అంతరార్థ మేమంటే అర్జునుడనే వ్యక్తి ఎవడో కాదు. ఎక్కడో లేడు. నిమిత్త మాత్రుడతడు. వాస్తవంలో భూమి మీద బ్రతికే ప్రతి మానవుడూ అర్జునుడే. నరుడు గదా అర్జునుడు. నరుడంటే మానవుడే. నరుడికి నారాయణుడెప్పుడూ చూపుతూనే ఉన్నాడు తన విశ్వరూపం. కానీ చూస్తూ కూడా మనం భయపడిపోతున్నాం. దివ్యదృష్టి ఇచ్చినా భయమే మనకు. నీకూ నాకూ ఉన్న జ్ఞానమే ఆ

Page 454

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు