విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
అలాగే భయంకరమైన రూపంతో కనిపిస్తూనే కూచున్నాడు. ఎప్పుడైతే ఇక తట్టుకోలేక నాకీ భయానకమైన రూపం చూడట మిష్టం లేదు సౌమ్యమైన నీ సహజరూపంతోనే కనపడితే చూడాలని కోరాడో అప్పుడుప సంహరించాడా విశ్వరూపం. ఏదీ ఉపసంహరించి నట్టెక్కడా పేర్కొన లేదే వ్యాస భగవానుడు. అదే చమత్కారం. అదంతా నాటకీయమైన ఫక్కిలో జరిగిపోయింది.
అలా జరిగిపోయిందని భావించే వ్రాస్తున్నారు భగవత్పాదులు. అర్జునం భీత ముపలభ్య - ఉపసంహృత్య విశ్వరూపం ప్రియ వచనేన ఆశ్వాసయన్ భగవానువాచ. అర్జునుడు బాగా భయపడి పోయాడని గ్రహించి తన విశ్వరూపాన్ని ఉపసంహరించి మంచి మాటలతో అతణ్ణి బుజ్జగిస్తూ ఇక మాటాడుతున్నాడట పరమాత్మ. ఇదంతా ఎప్పుడు జరిగింది. జరిగినట్టు మనమర్ధం చేసుకోవాలని మహర్షి హృదయం. అదే బయట పెట్టారు భగవత్పాదులు.
మయా ప్రసన్నేన తవార్డు నేదం
రూపం పరం దర్శిత మాత్మ యోగాత్
తేజోమయం విశ్వమనంత మాద్యం
యన్మే త్వదన్యేన న దృష్ట పూర్వమ్ - 47
Page 453