విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
కాని ఒక్క కృష్ణావతారంలోనే నాలుగు చేతులు. అది చూస్తేనే చాలు. ఆయన మహావిష్ణువని ఎవడికైనా అర్థమవుతుంది. అంతేగాక ఆ చేతులలో ఉన్న పాంచజన్య సుదర్శన కౌమోదకీ నందకాది దివ్యాయుధాలను చూచినా అర్థమవుతుం దాయన దివ్యపురుషుడని. అయినా కంసశిశుపాల జరాసంధాదుల కర్థం కాలేదంటే అది వారి బుద్ధి మాంద్యం తప్ప మరేదీ గాదు.
అర్జునుడు ప్రాధేయ పడుతున్నాడిప్పు డలాటి రూపంలో నాకు
దర్శన మివ్వమని. అంతే కాదు. ఇంకా ఒక మాటేమంటే తేనైవ రూపేణ
చతుర్భుజేన సహస్ర బాహో భవ విశ్వమూర్తే- అని కూడా వేడుకొంటాడు.
అంటే ఏమని అర్థం. నీవింతకు ముందు సహస్ర బాహువులతో కనిపించి
నన్ను హడల గొట్టావు. అవి ఉపసంహరించి ఇప్పుడు చతుర్బాహువులతోనే
కనిపించమంటాడు. చూడండి. మామూలుగా కనపడితేనే భయముండదు
మానవుడికి. అసాధారణమైన రూపాన్ని చూపితే ఎప్పుడూ భయమే. సహస్ర
బాహువులతో కనపడట మ సాధారణం. అందుకే భయపడ్డా డర్జునుడు.
కనుకనే తేనైవ రూపేణ చతుర్భుజేన భవ విశ్వమూర్తే. నీవు విశ్వమూర్తి
వయి దర్శనమిస్తే నాకు భయమే. కృష్ణమూర్తి వయి కనిపిస్తేనే అభయం
నా కని మొరపెడతాడు. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే ప్రస్తుత
మర్జునుడు తాను స్వయంగా అడుగుతాడా లేదా అని చూస్తున్నాడు స్వామి.
భయంగా ఉందని చాలాసేపటి నుంచి అంటున్నా పట్టించుకో లేదాయన.
Page 452