కిరీటినం గదినం చక్రహస్త
మిచ్ఛామి త్వాం ద్రష్టు మహం తధైవ
తేనైన రూపేణ చతుర్భు జేన
సహస్ర బాహో భవ విశ్వమూర్తే - 46
కిరీటినం గదినం చక్రహస్తం - ఇచ్ఛామి త్వాం ద్రష్టు మహం
తధైవ. కిరీట గదా చక్రాదులు ధరించిన రూపమేదో అలాటి మీ రూపాన్ని
చూడాలని నాకోరిక అంటాడు. సరిగా ఇది విష్ణు నామాలను గుర్తు చేస్తున్నది
మనకు. శంఖీ చక్రీ గదీ శార్జీ అని చివరి చివరి నామాలు విష్ణు సహస్ర
నామాలలో. ఇలాటి దివ్యాయుధాలు నాలుగూ నాలుగు చేతులలో ధరించిన
వాడు. ఆయన కృష్ణుడా. విష్ణుడా. నాలుగు బాహువులూ శంకచక్రాదులైన
నాలుగా యుధాలూ ధరించినవాడు విష్ణువే. మరి కృష్ణుణ్ణి ఆరూపంలో
చూడాలంటా డేమిటి అర్జునుడు. విష్ణు రూపమేదో అదే కృష్ణ రూపం.
వైకుంఠంలో ఉన్నాడని లోకు లూహిస్తున్న దేవుడే భూలోకంలో కృష్ణ
రూపంలో సాక్షాత్తూగా నిత్యమూ దర్శన మిస్తున్నాడు సకలజనులకూ.
ఎంత ఆశ్చర్యం. అప్పటి కారూపం చూస్తుంటే ఆది విష్ణువే కృష్ణరూపంగా
అవతరించాడని ఎవరూ చెప్పకుండానే అర్థం కావటం లేదా. అసలు
నాలుగు చేతులే అవతారంలో చూడగలం మనం. మత్స్య కూర్మాదుల
కసలు చేతులే లేవు. పరశురాముడి దగ్గరి నుంచే చేతులనే వున్నాయి.
కాని రెండే. బలరాముడి కున్నాయి రెండే. శ్రీరాముడికీ ఉన్నాయి రెండే.
Page 451