తమకు బాగా సన్నిహితులూ ఇష్టులూ అయినవారి నెవరూ కాదన లేరు. ఏమైనా వారివల్ల పొరబాటు జరిగినా ఏమీ అనుకోరు. ఏదీ జరగనట్టే భావించి వారితో కలిసి మెలిసి ఉండగలరు. ముఖ్యంగా తల్లి తండ్రి పెనిమిటి స్నేహితులూ వీరికంటే సన్నిహితులూ లేరు హితులూ లేరు. అలాంటి వారి విషయంలో పొరపొచ్చా లెప్పుడూ రావు. ఒకవేళ వచ్చినా శాశ్వతంగా నిలవవు. ప్రస్తుతం పరమాత్మ కంటే మానవులకు హితు లెవరున్నారు సన్నిహితు లెవరున్నారు. తండ్రి అయినా తల్లి అయినా హితుడైనా స్నేహితుడైనా - భర్త అయినా ఈశ్వరుడే మనబోటి జీవకోటికి. గతిర్భర్తా ప్రభుస్సాక్షీ అని గదా గీతా వచనం. అలాటివాడుండగా ఇక భయమేమిటికి మానవుడికి. ఎటు వచ్చీ ఆ తత్త్వానికి దాసోహ మనటం వరకే వీడి డ్యూటీ. అయితే మిగతా విషయమాయనే చూచుకొంటాడు. అదీ బరవసా.
అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యధితం మనోమే
తదేవమే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్ని వాస - 45
ఇదుగో చూచారా. ఇప్పుడు సాక్షాత్తుగా బయటపడుతున్నా డర్జునుడు. ఇంతవరకూ భగవత్తత్త్వమంతా తన కర్థమైన ఒక మహాజ్ఞాని లాగా మాట్లాడాడు. అది పనిచేయక పోతే పలు విధాల ఆయన గుణగణాలను కీర్తిస్తూ వచ్చాడు. కాని ఉలక లేదు పలక లేదు భగవానుడు. బహుశా
Page 449