#


Index



విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత



తస్మా త్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వా మహ మీశమీడ్యం
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియా యార్హసి దేవ సోఢుమ్ - 44


  ఇంకా ప్రశంసిస్తున్నాడు ప్రాధేయపడుతున్నా డర్జునుడు. ఎంత మొరపెడుతున్నా విశ్వరూపమింకా ఉపసంహరించటం లేదాయన. ఏమి చేస్తాడు పాపం ప్రాధేయపడక. భక్తి కంటే భయ మెక్కువయిందిప్పు డర్జునుడికి. అంచేతనే మన్నించు క్షమించమని మాటి మాటికీ వినకారు చేస్తూ కూచున్నాడు. తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వా మహ మీశమీడ్యం. అయ్యా - స్వామీ - నీవీశ్వరుడవీ సమస్త లోకాలకూ అధిపతివి నియామకుడవు. నిన్ను మించిన ప్రభువెవడూ లేడు. కనుక మేమేదైనా విన్నపం చేయాలంటే తమకే చేసుకోవాలి. నీవే ఈడ్యుడవు. పూజ్యాతి పూజ్యుడవు. ప్రసాదయే త్వాం నాకు ప్రసన్నుడవు కమ్మని వేడుకొంటున్నాను. శరీరం వంచి మీకు నమస్కరిస్తున్నాను. కరుణించు నన్ను. పితేవ పుత్రస్య. ఒక తండ్రి తన కొడుకును మన్నించినట్టు సఖేవ సఖ్యుః ఒక మిత్రుడు తన మిత్రుణ్ణి క్షమించినట్టు - ప్రియః ప్రియా యాః ఒక ప్రియుడు తన ప్రియురాలిని సహంచినట్టు అర్హసి దేవసోఢుం. నేను చేసిన అపరాధ మేదైనా ఉంటే మనసులో ఉంచుకోకుండా పెద్ద మనసు చేసి నన్ను మన్నించ గోరుతున్నానని వాపోతాడు. లోకంలో కూడా

Page 448

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు