#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

పూజనీయుడవు నీవు. అంతేగాక గురుస్థానమూ నీవే నాకు. నిన్ను మించిన గురువు లేడు కాబట్టి గరీయాన్ గురుతరుడవూ నీవే. నత్వత్స మోస్తి సర్వమూ నీవే అయినప్పుడు నీకు సాటి వేరొక డెవడున్నాడు. అలాగే అధికః కుతోస్యః నిన్ను మించిన వాడెవడున్నాడు. లోకత్రయే - మూడులో కాలలోనూ కానరాడు. అప్రతిమ ప్రభావ - అలాటిదీ నీ మాహాత్మ్యం. సాటిలేనిదది.

  భగవత్పాదులు వ్రాస్తున్నారు వినండి. నహి ఈశ్వర ద్వయం సంభవతి - ఈశ్వరులనే వారిద్దరుండరీ సృష్టికి. అనేకేశ్వర త్వే వ్యవహారాను పపత్తేః - ఎందుకంటే ఇద్దరు ముగ్గురీ శ్వరులుంటే లోక వ్యవహారం జరగదు. కుంటు పడుతుంది. ఒకడు పాలకుడు. మిగతా వారందరూ పాలితులయి నప్పుడే చక్కగా నడుస్తుంది. పాలకు లనేకులైతే వారిలో న్యూనాధిక భేదమేర్పడక తప్పదు. అప్పుడధికుడైన వాడీశ్వరుడయి అధములయిన వారనీశ్వరులు కావలసి వస్తుంది. వస్తేవారిక ఈశ్వరుడే కారు. మిగతా పాలితులైన జీవుల కోటిలో చేరిపోక తప్పదు. కాబట్టి జీవులనేకులైనా వారి మంచి చెడ్డలు చూడవలసిన ఈశ్వరుడొక్కడే కావలసి ఉంది. ఇప్పుడీ వర్ణన మూలంగా మరొక విషయం కూడా సూచిత మవుతున్నది. ఈశ్వరుడంటే సజాతీయ విజాతీయ స్వగత భేదమేదీ లేనివాడని శాస్త్రం చాటిన మాట. అప్రతిమ ప్రభావ అనటం వల్ల భేదత్రయ మేదీ లేదని తేటపడుతున్నది.

Page 447

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు