విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోవాలంటే ఒక్కటే మార్గం. అతనికి తనమీద ఏదైనా కోప తాపాలుంటే వాటి కుపశమనోపాయం వెతకటం. అలాటి ఉపశమన మార్గమే ఇప్పుడు తన గతాన్నంతా తవ్వుకొని అపరాధ కానుకలు చెల్లించుకోట మాయనకు. అన్ని నొప్పులకూ మందు అమృతాంజన మన్నట్టు అన్నిటికీ పరిహారం పరిపూర్ణ శరణాగతి. ఆ మార్గంలోనే ప్రయత్నం సాగిస్తున్నా డింకా.
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్
నత్వత్సమో స్త్యభ్యధికః కుతో న్యో
లోకత్రయే ష్య ప్రతిమ ప్రభావ - 43
చూడండి పొగడ్తల మీద పొగడ్తలు చేస్తున్నాడు. పితాసి లోక స్య చరాచర స్య త్వమస్య - ఈ స్థావర జంగమాత్మకమైన సృష్టి కంతా నీవే తండ్రివి. సృష్టి కర్త ఆయనే అయినప్పు డాయన గాక మరి ఎవడు తండ్రి. తండ్రి అయినా పరమాత్మే. తల్లి అయినా పరమాత్మే. ఎందుకంటే ఇద్దరూ లేకుంటే సృష్టి జరగదు. ఇందులో తండ్రి నిమిత్తకారణమైతే తల్లి ఉపాదాన కారణం. లోకంలో వారు విడి విడిగా కనిపిస్తున్నా లోకానికంతా అతీతమైన దాని విషయంలో రెండూ ఒక పరమాత్మే. శుద్ధ చైతన్యాత్మకంగా తానే నిమిత్త కారణమైన తండ్రి. తన మాయాశక్తి రూపంగా తానే ఉపాదాన భూతమైన తల్లి. కనుకనే పూజ్యశ్చ గురుర్గరీయాన్ జగత్తుకంతా
Page 446