విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
జరిగి ఉండవచ్చు. ఏకోధవా. అదంతా గడచిపోయిన రోజులలో పరోక్షంగా జరిగినా జరిగి ఉంటుంది. కాని ఇప్పుడు నేను సమక్షంలో తత్ క్షామయే త్వా మహ మప్రమేయం. ప్రత్యక్షంగా నిన్ను వేడుకొంటున్నాను. వాటన్నిటినీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించమని. దాసుని తప్పులు దండంతో సరి అన్నారు. ఒకసారి దండం పెడితే చాలు గండం తప్పుతుందంటారు. ఒకసారి గాదు. ఆమాటకు వస్తే వందసార్లు పెడతా నీకు దండం. నన్ను మన్నించమని ప్రాధేయ పడతాడు. భయంతోనే భక్తి పుట్టుకు వస్తుందెవరికైనా. ఇంతకూ విశ్వరూపం చూడాలని ఉబలాట పడ్డాడే గాని అర్జునుడు. తీరా చూపించేసరికి గాబరా పడుతున్నాడు. పడి అలాగే చూపుతూ పోతాడేమో చూపితే ఆ భయానకమైన దృశ్యం నుంచి తప్పించుకొని బయటపడనేమోనని భయపడుతున్నాడు. అందుకోస మనేక మార్గాలలో ఆ విశ్వేశ్వరుణ్ణి మంచి చేసుకోటానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో మొదట తన మనసుకు పట్టి నా పట్టకున్నా స్వానుభవానికి వచ్చినా లేకున్నా తనకు తెలిసిన అధ్యాత్మ విజ్ఞానమంతా ఒలకబోశాడు. అది కూడా పని చేస్తుందో లేదోనని అనుమానం వేసిందతనికి. ఎందుకంటే అతడి స్థాయి ఎలాంటిదో పరమాత్మ కెప్పుడో తెలుసు. జ్ఞానాధికారి కాదర్జురుడు. కర్మాధికారి, అందుకే కర్మణ్యేవాధికారస్తే అని మొదటనే ముద్ర వేశాడతనికి. కనుక ఇప్పుడిక ఎంత కీర్తించినా అదంతా ఆర్తుడయి చేస్తున్నదే గాని జిజ్ఞాసువో జ్ఞానియో అయి చేశాడనుకోడు భగవానుడు. అంచేత
Page 445