#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


చూస్తున్నాడు. అయితే కొంచెమైనా కాకా పడితే గాని ప్రసన్నుడు కాడేమో నని మనసులో అనిపించ వచ్చు బహుశా. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబు లిత్తురనే ఆభాణకం గుర్తు వచ్చి ఉండవచ్చు కూడా. అందుకే ఆయన గారిని ఖుషీ చేసే మాటలు కొన్ని అప్రయత్నంగా వస్తున్నాయతని నోట. భయోత్పాత మెక్కువైతే కాళ్ల బేరానికి కూడా రావటమూ ముఖప్రీతిగా మాటాడటమూ సహజమే గదా మానవులకు. అదే కనిపిస్తున్నదిప్పు డర్జునుడి మాటలలో. ఏమిటా మాటలు.

  సఖేతి మత్వా - నీవు నా స్నేహితుడవే గదా అనే చనువుతో హే కృష్ణ హే యాదవ - ఒరే కృష్ణా ఒరే యాదవా అని ఏకవచన ప్రయోగం చేసి ఉండవచ్చు. ఒరే తురే అని తూలనాడి ఉన్నా ఉంటానేమో. అ జానతా మహి మానం త వేదం అది నీ గొప్పతనం తెలియక చేసిన తప్పిదం. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. దానికి కారణం నా పొరబాటైనా కావచ్చు. నిమీది స్నేహాతిశయమైనా కావచ్చు. మరే ఉద్దేశంతోనూ అన్న మాటలు కావవి.

  అంతేకాక యచ్చావహాసార్ధ మసత్కృతోసి - సర్వదా నీతో వేళాకోళం కూడా ఆడి ఉండవచ్చు అప్పుడప్పుడూ పరిహాసమే గాదు. పరాభవించి కూడా ఉండవచ్చు. అవమానకరంగా మాటాడి ఉండవచ్చు. ఎప్పుడని విహార శయ్యాసన భోజనేషు. నీతో కలిసి వాహ్యాళికి వెళ్లినప్పుడు గాని శయనించినప్పుడు దాని ఆహారాదులు సేవించేటపుడు గాని ఎపుడైనా

Page 444

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు