విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
నమస్కారమే. నీకు వెనుకా నమస్కారమే. నమోస్తు తే సర్వత ఏవ సర్వ. ముందేమిటి. వెనకేమిటి పక్కల ఏమిటి. పైనా కిందేమిటి సర్వత ఏవ అన్ని కోణాల నుంచీ చేసినా చేయవచ్చు. చేసే కొద్దీ తనివి తీరదు. చేస్తూనే పోవా లనిపిస్తుం దంటాడు. సరిగా ముండకోపనిషత్తు మాట గుర్తు వస్తుందిక్కడ. బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తా దృహ్మ దక్షిణ తశ్చోత్త రేణ అధశ్చోర్ధ్వం ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం. వెనుకా ముందూ కుడీ ఎడమా క్రిందా పైనా - ఎక్కడంటే అక్కడ బ్రహ్మమే బ్రహ్మం. అంతేగాదు. దీనికి వెనుకా ముందని గాదు. ఇది కూడా బ్రహ్మమే. అది నా స్వరూపమే. ఒక్క మాటలో చెబుతున్నదీ భావమే భగవద్గీత. అదే మయాతత మిదం సర్వమనే మాట. ఈ వాక్యం గీతలో ఇంతకు ముందూ వచ్చింది. ఇక మీదటా రాబోతున్న దిప్పుడూ అదే వినిపిస్తున్నది మనకు. శాస్త్ర విజ్ఞాన మంతా ఇందులోనే ఉన్నది గమనించమని మనకు హెచ్చరిక చేయటానికే వ్యాసమహర్షి ఇంత తరుచుగా ఆ వాక్యం మనకు వినిపిస్తూ పోవటం. మరొక రహస్యమేమంటే ఇక్కడ సర్వత ఏవ అనే గాక సర్వ అని కూడా ప్రయోగిస్తున్నాడు. సర్వత్రా ఉండటమే గాదా స్ఫురణ. సర్వమూ కూడా అదేనని వాచా బోధిస్తున్నాడు. స్వరూప విభూతులు రెండూ ఆత్మే. పరిపూర్ణమైన అద్వైత భావమిది. ఇక శాస్త్రం చెప్పవలసినదే ముంది. మనం గ్రహించవలసిన దేమి మిగిలింది. అనంత వీర్యామిత విక్రమస్త్వం అనంతమైన వీర్యమూ అమితమైన విక్రమమూ. వీర్యానికంతం లేదు.
Page 442