#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

>

సామానాధి కరణ్యం. నైల్యమనే విశేషణమూ ఉందక్కడ. ఉత్పలమనే విశేష్యమూ ఉందా పుష్పంలో. ఒకదాన్ని ఒకటి త్రోసి పుచ్చటం లేదు. పోతే రజ్జు సర్పమని పేర్కొన్నా మనుకోండి. రజ్జు వున్నచోట సర్పం లేదు. సర్పమున్న చోట రజ్జువనే భావం లేదు. సర్పం కనిపించినంత సేపూ రజ్జువక్కడే ఉన్నా కనపడదు. మరుగు పడి ఉంటుంది. అలాగే రజ్జువే బయటపడి కనిపిస్తున్నదను కోండి. అప్పుడిక సర్పమనే భావానికే అక్కడ ఆస్కారం లేదు. మటుమాయ మవుతుంది. అంచేత ఇలాటి దానికి అపవాద లేక బాధ సామానాధికరణ్య మని పేరు. అధిష్ఠానం కనిపిస్తే ఆరోపిత మెగిరిపోతుంది. ఇదీ బాధ అంటే. ప్రస్తుతం వాయుర్యమోగ్నిః వాయ్వాది దేవతలందరూ పరమాత్మేనని వర్ణించాడంటే వాయ్వాదు లెగిరి పోయి వారి స్థానంలో పరమాత్మే మనసుకు వస్తున్నాడు. ఈ సర్పం రజ్జువే నన్నప్పుడు సర్పం మనసుకు రాక దాని బదులు రజ్జువే ఎలా వస్తుందో అలా.

  ఇప్పుడెవరికి చేయాలి నమస్కారం. ఎవరికి చెందాలది. ఎవరక్కడ కనిపిస్తున్నాదో వారికీ. అంటే పరమాత్మకే. కనుకనే తేతే నీకు నీకు అని పరమాత్మకే చేస్తున్నాడు నమస్కారం. ఒకటా ఒక మారా. నమో నమస్తేస్తు సహ స్ర కృత్వః వేయి మార్లు నీకే నమస్కార మంటున్నా డర్జునుడు. అంతేకాదు. ఆ వేయిసార్లు నమస్కరించటం కూడా ఒకవైపు నుంచి కాదు. అన్ని వైపుల నుంచీ నమః పురస్తా దథ పృష్ఠతస్తే నీకు ముందు

Page 441

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు