#


Index

విశ్వరూప సందర్శన యోగము

డర్జునుడనే అపదేశంతో. ఏమని. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపత్తిస్త్వం ప్రిపతా మహశ్చ. నీవే వాయుదేవుడవు. నీవే యమ వరుణాది దేవతారూపుడవు. శశాంకః చంద్రుడవు నీవే. ప్రజాపతి అయిన చతుర్ముఖుడవు నీవే. పితామహుడైన బ్రహ్మకు కూడా జనకుడవు గనుక ప్రపితా మహుడవు కూడా నీవే. ఇక్కడ నీవే వాడని వర్ణించటం వల్ల మనకే మర్ధమయింది. ఆయా దేవతలు లేరు. వారి రూపాలలో కనిపిస్తున్నది ఆయా పనులు చేస్తున్నది పరమాత్మే. వాస్తవంలో అక్కడ ఉన్నది. పరమాత్మే. ఆయా దేవతామూర్తులు కాదని స్పష్టంగా తెలిసిపోతున్నది. అయితే వారంతా ఎవరు. ఎవరో కాదు. పరమాత్మ వేషాలవి. అవతారాలు. ఉపాధులు. ఆ భాసలు. ఇంకా ఆ మాటకు వస్తే విభూతి శకలాలు. ప్రజాపతిస్త్వం అని సామానాధికరణ్యం చేసి వర్ణించటంలోనే బయటపడుతున్నదీ రహస్యం.

  సామానాధికరణ్య మంటే సమానమైన అధికరణం. రెండు పదార్ధాల కొకే ఒక ఆధికరణం లేదా ఆధారం. నీలోత్పల మన్నప్పుడు నీలవర్ణమూ ఉత్పలమనే పుష్పమూ రెండు భావాలు మనకు స్ఫురిస్తున్నాయి. ఎక్కడ ఉన్నాయవి రెండూ. ఒకటి ఒకచోటా మరొకటి మరొక చోటా గాదు. రెండూ కలిసి ఒకేచోట ఉన్నాయి. ఒక నల్ల కలువ చేతికి తీసుకొని చూస్తే నల్లని వర్ణమూ ఆ కలువా రెండూ కలిసి ఒకే ఆశ్రయాన్ని పంచుకొని ఒకే పుష్పంలో కాపురం చేస్తున్నాయి. ఇది విశేష్య విశేషణ రూపమైన

Page 440

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు