#


Index

విశ్వరూప సందర్శన యోగము

వేస్తూ జీవ జగదీశ్వర రూపంగా అభినయిస్తుంటాడు. ఇంతకంటే ఇంద్రజాల మహేంద్ర జాలమే మున్నది. అసలైన లీల ఇదే.

వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతి స్త్వం ప్రపితా మహశ్చ
నమో నమస్తేస్తు సహస్ర కృత్వః పునశ్చ భూయో పి నమో నమస్తే - 39

నమః పురస్తా దథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ
అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః - 40


  అంతేకాదు. అంతకన్నా గొప్ప విషయమేమంటే త్వయాతతం విశ్వమనంత రూప అని వర్ణించటం. అనంత మంటూ మరలా రూపమేమిటి పరమాత్మకు. రూపముంటే అనంతమెలా అయింది. అంటే అనంతంగా వ్యాపించి ఉండటమే దానికి రూపంగాని ఒక రూపం. ఎందుకు వ్యాపించింది. ఎలా వ్యాపించింది. త్వయా తతం విశ్వమంటున్నాడు. విశ్వమంటే ప్రపంచం త్వయా అంటే విష్ణు. విశ్వం విష్ణుః - విశ్వమంతా విష్ణువే. ఇక విష్ణువు గాక దానికన్యంగా విశ్వమెక్కడిది. లేదు. జడపదార్ధమైన వన నదీ సముద్ర పర్వత సూర్యచంద్రాది గోళాలే కాదు. చేతన పదార్ధాలైన దేవ మనుష్య తిర్యగాది జీవకోటి కూడా. అదే వర్ణిస్తున్నాడు వ్యాసభట్టారకు

Page 439

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు