విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
భాష్యకారులు. చరా చర ప్రపంచమంతా ఆది మధ్యాంతాలలో ఏ మహా చైతన్యంలో అంతర్గత మయి ఉందో అదీ నిధానమంటే. యతో వా ఇమాని భూతాని జాయంతే అని గదా ఉపనిషద్వాణి. కనుక అనాత్మ ప్రపంచాని కాధారమాత్మే. అనాత్మగా భాసిస్తున్నదీ ఆత్మే. అంటే అప్పటి కాధారా ధేయాలు రెండూ ఆత్మే నన్న మాట. అంటే అర్థం. ఆత్మగా నిధానమదే. అనాత్మగా విధేయమైన విశ్వమూ అదే. మరో భాషలో చెబితే వేత్తాసి వేద్యంచ పరంచ ధామ. వేద్యమూ పరమాత్మే. వేత్తా పరమాత్మే. అంటే జ్ఞేయమూ తానే జ్ఞానమూ తానే. తన్ను తానే చూస్తున్నాడు. గ్రహిస్తున్నాడు. తనకు విలక్షణంగా గ్రహించే జీవుడు గాని గ్రహించబడే జగత్తు గాని వేరే లేదు. గ్రాహ్యగ్రాహ కాలనే రెండు వేషాలు ధరించి తానే తనతో వ్యవహరిస్తున్నాడు. అలాగని వ్యవహారం వరకే పరిమితం కాడు. మరేమిటి. ఎంత వ్యావహారికంగా కనిపిస్తున్నాడో పరంచ ధామ. అంత దానికి అతీతంగా ఉన్న ధామమది. చెప్పాము గదా. ధామమంటే తేజస్సనీ. స్థానమనీ. వేత్తృవేద్యాలయిన జీవజగత్తుల రూపంగా ఉంటూనే తద్ద్వారా వ్యవహరిస్తూనే తదతీత మైన స్థానంలో స్వయంగా ప్రకాశిస్తూ ఉండగలడు. తస్మిన్ దృష్టే పరావరే అని కఠోపనిషత్తు దీనినే పరావరమని పేర్కొన్నది. పరమనేది పారమార్ధికం. అవరమనేది వ్యావహారికం - మొత్తం మీద సవ్యసాచి పరమాత్మ. ఉభయ భాషా ప్రవీణుడు. అటు పారమార్ధికంగా ఏ గుణమూ లేకుండానే ఇటు అన్ని గుణాలూ దగ్గర పెట్టుకొని అన్ని వేషాలూ
Page 438