అంతేకాదు. తత్ త్వమేవ నాన్యత్. అది నీకు దూరంగా ఎక్కడో ఉంది ఏదోనని తలపోయకు. నీవే సుమా. నీ స్వరూపమే అది. నీకు వేరుకాదని కూడా చాటుతున్నాడు. ఇంత అద్వైత భావ మర్ధమయిందా అక్కడ అర్జునుడికి. ఏమో చూతాం.
త్వమాది దేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానం
వేత్తాసి వేద్యంచ పరంచ ధామ
త్వయా తతం విశ్వ మనంత రూప - 38
ఇది మరీ గొప్ప అద్వైత బోధ. వాడు అంత గొప్ప జ్ఞాని అయితేనే ఇలాటి మాటలు నోట రావాలి. ఏమిటా మాటలు. ఎలాంటి వవి. వినండి. త్వమాది దేవః పురుషః పురాణః - దేవతలనే వారెంత మంది ఉన్నారో వారందరికీ ఆది అంటే మొదటివాడవు నీవు. మొదటి దేవత వంటే దేవతలలాగా ఏదో ఒక రూపమూ విగ్రహమూ ఉందని గాదు మరలా. పురుషః పూర్ణమైన చైతన్యమది. దానికి నామరూపక్రియా గంధం లేదు. అది కూడా పురాణః పురాపి నవ ఏవేతి పురాణః ఎంత పాతదో అంత కొత్తదా తత్త్వం. నవ నవోన్మేష మైనది Ever Fresh. స్వరూప దృష్ట్యా పాతది. విభూతి దృష్ట్యా కొత్తది. స్వరూప విభూతులు రెండూ అదే కాబట్టి పాత కొత్తల కలయిక అది.
అంతే కాదు. త్వమస్య విశ్వస్య పరం నిధానం. ఈ విశ్వమంతా పరమమైన నిధానం. నిధీయతే అస్మిన్ జగత్సర్వమితి నిధానమని వ్రాస్తారు
Page 437