బ్రహ్మదేవుడికి కూడా మహాత్ముడే. గరీయసే. అతడు గొప్పవాడను కొంటే అంతకన్నా గొప్పవాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఆదికర్త అని పేరు. ఆదికర్తా సభూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత అని శాస్త్రం చెబుతున్నది. సమస్త భూత జాతానికే సృష్టి కర్త అట బ్రహ్మ. కాని ఆ బ్రహ్మకు కూడా సృష్టికర్త అంటున్నాడిప్పుడు పరమాత్మను. అదే పురాణాలలో బ్రహ్మదేవుడు విష్ణునాభి కమలం నుంచి జన్మించాడని చెప్పే కధలోని అంతరార్ధం. అప్పటికి బ్రహ్మ సాది అయితే పరమాత్మ అనాది. ఆది లేదంటే ఇక అంత మంతకన్నా లేదు. అనంత. ఆద్యంతాలు రెండూ లేని పరమాత్మ అవి రెండూ ఉన్న మానవులకే గాదు. దేవేశ. దేవతలకు కూడా ఈశుడే. ప్రభువే. దేవతల అజరామర త్వ మప్పటికి సాపేక్షమే Relative గాని నిరపేక్షం Absolute కాదని చెప్పినట్టయింది.
అంతేకాదు. జగన్నివాస. జగత్తుకంతా ఆయన నివాస స్థానమనీ చెప్పవచ్చు. జగత్తులో నంతా ఆయనే నివసిస్తున్నాడనీ చెప్పవచ్చు. వాసనా ద్వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి అంటే ఏమిటర్థం. వాసితం తే జగత్రయం వరకూ జగత్తంతా ఆయనలో వసిస్తున్నదనీ సర్వభూతనివాసో సి వరకూ సమస్త ప్రపంచంలో ఆయనే నివసిస్తున్నాడనే గదా. అలా పరమాత్మే ఈ సర్వానికీ ఆధారమూ ఆధేయమూ Both container & contained అయినప్పుడిక సర్వమూ అనేదెక్కడ ఉంది. సర్వము తాన యైన వాడెవ్వడన్నట్టు సకల జగత్తూ
Page 435