#


Index

విశ్వరూప సందర్శన యోగము

పోవాలని చూస్తారు. అయితే అలా పోవాలనుకొన్నా పోలేరు. అంతా విశ్వేశ్వరుడి రూపమే అయినప్పుడు. దేనినుంచి తప్పించుకొంటారు. ఎలా తప్పించుకొంటారు. ఎప్పటికైనా పరిష్కారం తప్పించుకోటం కాదు. అర్థం చేసుకొని ఈ విశ్వరూపమంతా విశ్వేశ్వరుడేనని దీనిలో ప్రతిచోటా ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తూ పోవటం. అలా గుర్తించేవారే సిద్ధులు. వారిది దైవ సంపద. వారు భీతులు కారు. ప్రీతులు. అందుకే ప్రతి ఒక్కదాన్నీ భగవత్స్వరూపంగా చూచి తమలో తాము మురిసిపోతుంటారు. నమస్కరిస్తుంటారు అప్రయత్నంగా.

కస్మాచ్చతే న నమేరన్ మహాత్మన్
గరీయసే బ్రహ్మణో ప్యాది కర్తే
అనంత దేవేశ జగన్నివాస
త్వమ క్షరం సదసత్తత్పరం యత్- 37


  కాకపోయినా అలాంటి మహనీయులూ జ్ఞానులూ కస్మాచ్చతే నన మేరన్. ఎందుకని నీకు నమస్కరించరు. నీవు మహాత్ముడవు. మేము జీవాత్ములమైతే నీవు పరమాత్మవు. మనోవాక్కాయాదులైన తన సకలోపాధులనూ నీకు సమర్పించి నప్పుడే అది పరిపూర్ణ శరణా గతి. అలా శరణాగతులై తేనే ఈ జీవాత్ములు పరమాత్మ సాయుజ్యం పొందగలిగేది. అంతవరకూ ఆయన మనకు మహాత్ముడే. మనకే గాదు. గరీయసే బ్రహ్మణోప్యాది కర్రే. ఆఖరుకా సత్య లోకాధి పతి అయిన

Page 434

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు