#


Index

విశ్వరూప సందర్శన యోగము

  అంతే కాదు. మరొక అంశం కూడా ఉంది మనం గ్రహించ వలసింది. రక్షాంసి భీతాని దిశోద్రవంతి. సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః - భగవత్ప్ర భావాన్ని అర్థం చేసుకొనే వాళ్లు కొందరైతే అసలా భగవత్తత్త్వాన్నే నమ్మనివాళ్లు మరికొందరు. అందులో నమ్మని వారే నూటికి తొంభయి మంది. నాస్తికులు వారు. వారినే రాక్షసులంటారు. భక్తులం గని చక్రాయుధుడేడి చూపుడనే బాపతు వారు. లేడు లేడని ఇంటా బయటా చాటుతూ పోయేవారు. ఎన్ని నిదర్శనాలు కనిపిస్తున్నా నమ్మరు వారు. మొండివాళ్లు. అలాంటి వాళ్లీ విశ్వరూపాన్ని చూచారంటే ఎక్కడి వాళ్లక్కడ పరారయి పోక తప్పదు. చూడక చెడిపోతున్నారే గాని చూస్తే తట్టుకో గలరా. ఉత్తిష్ఠంతు భూత పిశాచాః అని ఏమయిపోతారో ఎక్కడికి పారిపోతారో అంతు పట్టదు. అలా కాక సిద్ధపురుషులెవరైనా ఉన్నారంటే వారెప్పుడూ ఆ తత్త్వాన్నీ దాని ప్రభావాన్నీ వింటుంటారు. కంటుంటారు. అలాంటి ఆస్తికులూ జ్ఞానులూ విశ్వరూపానికి నిత్యమూ నమస్కరిస్తూ దాని నాశ్రయించి బ్రతుకుతుంటారు. దుష్ట దూరా శిష్టేష్టా అని అమ్మవారి నామం. అసన్నేవ సభపతి అసద్య్రహ్మేతి వేద చేత్ - అస్తిబ్రహ్మేతి చేద్వేద సంత మేనం తతో విదుః అని శాస్త్రం కూడా ఘోషిస్తున్నది ఉన్నదనే వాడి మనస్సు కుందది ఎక్కడబడితే అక్కడ. సర్వత్రా అదే దర్శనమిస్తుంది. అనుభవానికి రాని వాడికే అనుక్షణమూ ఈ విశ్వరూపం కనపడుతుంటే భయం. జీవిత సత్యాలను ఎదిరించి నిలబడలేక తప్పించుకొని

Page 433

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు