#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


నీళ్లు నిండితే కఫంతో గొంతు మూసుకు పోయి మాట ధాటిగా రాదు. దానికి గద్గద మని పేరట. అలాటి మందస్వరంతో మాటాడుతున్నాడు.

  అర్జునుడు మాటాడే లోపలనే వ్యాసభగవానుడు మధ్యలో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఆడుతున్న మాటలు మనకు వినిపిస్తున్నాడు. అవే ఇప్పుడీ శ్లోకంలో మనం వింటున్న మాటలు. ఏతచ్ఛ ృత్వా అని గదా ఆరంభమయింది శ్లోకం. అంటే ఏమని. ఈ మాటలు విని అని అర్ధం. ఏ మాటలు. ఎవరి మాటలు. ద్రోణంచ భీష్మంచ అని కృష్ణుడర్జునుడికి చెప్పిన ధైర్య వచనాలు. భీష్మద్రోణాదులను కృష్ణుడు తానే సంహరించానని గదా చెప్పాడు. అలా చెప్పాడని సంజయుడు అర్జునుడింకా నోరుదెరచి మాటాడక. ముందే ధృతరాష్ట్రుడికి ఆ విషయం చెప్పటంలో ఏమిటి ఆంతర్యమని ప్రశ్న వస్తే భగవత్పాదులు బయటపెడుతున్నా రొక రహస్యం. అత్రాంతరే సంజయ వచనం సాభిప్రాయం. ఇక్కడ సంజయుని మాటలో ఒక అభిప్రాయ మిమిడి ఉన్నది. అదేమిటంటే ద్రోణాదిషు అర్జునేన నిహ తేషు అజేయేషు చతురు. భీష్మ ద్రోణాదులైన మహావీరులు నలుగురూ అర్జునుడి చేతిలో హతమయి పోతే. నిరాశ్రయో దుర్యోధనో నిహత ఏవేతి మత్వా. నిరాశ్రయుడయిన దుర్యోధనుడు కూడా నిహతుడయినట్టే నని భావించి. ధృతరాష్ట్రః జయం ప్రతి నిరాశ స్సన్ సంధిం కరిష్యతి. ధృతరాష్ట్రుడిక తన వాళ్లు గెలవటం కల్ల అని నిరాశ చేసుకొని తప్పకుండా పాండవులతో సంధి చేసుకొంటాడు. తతః శాంతి రుభయేషాం భవిష్యతి

Page 431

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు