విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ఆయన రూప మింకా అలాగే ఎదుట భౌతికంగా కనిపిస్తూనే ఉంది. కనుక ఉత్సాహంతో పాటు భయోద్వేగం కూడా వెంటాడుతున్నది. వేపమానః భయకంపాదులింకా వదలలేదు మానవుడికి. అంచేత నమస్కృత్వా. నమస్కరించి తృప్తి లేక ప్రణమ్య. మరలా వంగి వంగి సలాము చేస్తున్నాడు. సగద్గదం భీత భీతః - భయ భయంగానే ఉంది. ఇంకా. అది వదలకుండానే మాటాడుతున్నాడాయనతో. ఎవరాయన. కృష్ణం. కృష్ణుడేనట. ఇంతవరకూ కృష్ణ అనే మాట ఎక్కడా రాలేదు. విష్ణు హరి దేవ అనే మాటలే వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడే క్రొత్తగా కృష్ణ అనే మాట ప్రయోగిస్తున్నాడు మహర్షి అంటే అప్పటికి విష్ణు స్వరూపంగాక దాని బదులు కృష్ణ రూపమే కనిపిస్తున్నదా అర్జునుడికి. అలాగే అనుకోవాలి. అలాగైతే అది తనకు పరిచితమైన రూపమే గదా. భయకంపాదులు దేనికి. నిజమే. కాని కృష్ణ రూపమైనా అది తన విశ్వరూపాన్ని పూర్తిగా ఉపసంహరించి కనిపిస్తున్న రూపం కాదు. అందుకే తన ఎదుట ఉన్నది విష్ణువా కృష్ణుడా అని గట్టిగా తేల్చుకోలేక భయపడుతున్నాడు. వణకిపోతున్నాడు. ఆయనతో మాటాడుతున్నా సగద్గద మాహ. గద్గద స్వరంతోనే మాటాడుతున్నాడు. గద్గద స్వరమేమిటి. అదేమిటో వర్ణిస్తుస్తున్నారు వినండి భాష్యకారులు. అశ్రుపూర్ణ నేత్ర త్వే సతి శ్లేష్మణా కంఠావరోధః - తతశ్చవాచః అపాటవం మంద శబ్దత్వం యత్ స గద్గదః భయమూ హర్షమూ రెండూ ఎక్కువైతే కళ్లకు నీళ్లు వస్తాయి. కళ్లలో
Page 430