విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
అది ఎంత సుళువు నీకు. ఇప్పుడే చెప్పాను గదా నీవు కేవలం నిమిత్త మాత్రుడవే నని. ఒక పని మానవుడు చేస్తున్నాడంటే అందులో సాఫల్యం పొందుతున్నాడంటే అది తన ప్రభావమని మూర్ఛ పోగూడదు. అలాగైతే ఎప్పటికైనా దెబ్బ తింటాడు. తినకుండా కృతార్థుడు కావాలంటే భగవదనుగ్రహ ముండాలతనికి. అది నిరంతర భగవచ్చింతన ఉంటేనే లభ్యమవుతుంది. అలాటి శ్రద్ధాభక్తులున్న వాడు గనుకనే భగవాను డాయనను ఆశీర్వదిస్తున్నాడీ మాటలతో.
ఏత చ్ఛృత్వా వచనం కేశవస్య
కృతాంజలి ర్వేపమానః కిరీటీ
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీత భీతః ప్రణమ్య - 35
ఆ మాటలు వినేసరికి కొంచెం ధైర్యం వచ్చిందర్జునుడికి. ఏత చ్ఛృత్వా వచనం కేశవస్య - కృష్నుడి మాటలు విని కృతాంజలి ర్వేపమానః కిరీటీ. చేతులు జోడించి నమస్కరించా డాయనకు. ఎందుకు. తనకు యుద్ధంలో విజయం తప్పకుండా కలుగుతుందని ధైర్యమిచ్చి నందుకు. అంతేగాక అంతకు ముందే యోధ వీరుల నందరినీ తాను సంహరించానని గొప్ప వార్త చెప్పినందుకు. అంతకన్నా కావలసిన దేముంది తనకు. తనకు అనుకూలమైన మాట ఎవడైనా చెబితే మానవుడి కెంతో సంతోషం. దానితో ఎన్ని నమస్కారాలైనా చేస్తాడు. అలాగే చేస్తున్నా డర్జురుడు. అయినా
Page 429