విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ఎవరితో పోరాడాలని. ఎవరిని వధించాలని. అదే చెబుతున్నాడు భగవానుడు. యశోలభస్వ. నీవే వారిని వధించానని లోకంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించ మంటాడు. భీష్మ ప్రభృతయః అతిరధా అజేయా దేవైరపి అర్జునేన జితా ఇతి అని వ్రాస్తున్నారు భాష్యకారులు. భీష్మద్రోణాదులతి రధ మహారధులు. దేవతలు కూడా కన్నెత్తి చూడలేరు వారిని. అలాటి వారిని అర్జును డవలీలగా జయించాడనే కీర్తి లభిస్తుందట లోకంలో.
కాలస్వరూపుడైన పరమాత్మే గదా సంహరించా నంటున్నాడు వారిని. అలాంటప్పు డర్జునుడికి రావటమేమిటి కీర్తి. వాస్తవమే. కాలం సంహరించినా అది లోకానికి తెలియదు. అది అవ్యక్తంగా జరిగిన పని. వ్యక్తం కాదు గనుక ఎవరికీ లోకంలో అంతుపట్టే వ్యవహారం కాదు. మరి ఏదైతే తెలుస్తుంది లోకానికి. అర్జునుడి లాంటి ఒక వ్యక్తి గాండీవం చేత బట్టి రంగంలో ప్రవేశించి పుంఖాను పుంఖంగా బాణ ప్రయోగం చేస్తూ దాని తాకిడికి తట్టుకోలేక ప్రతిపక్ష వీరులు చాపకట్టుగా పడిపోతుంటే అలాటి వ్యక్తమైన చర్య నలుగురికీ గోచర మవుతుంటుంది. దాని వెనకాల ఉండి దాన్ని నడిపే అవ్యక్తమైన మహాశక్తి అలా గోచరించేది కాదు. దానికీ లోకం వల్ల ప్రశంసలందు కోవలసిన చాపల్యమే మాత్రమూ లేదు. అదంతా తన ఆభాసగా చూస్తున్న ఈశ్వరుడికి మానవులిచ్చే ప్రశంసా పత్రం దేనికి. అకించిత్కర మది. అంతే కాదు. ఒకవేళ అర్జునుడికే ఈ దైవ రహస్య మర్ధం గాక స్వప్రయోజం తోనే ఇంత కార్యం తాను
Page 426