#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


సాధించానని అతడి కహంకార మేర్పడినా ఏర్పడవచ్చు. అందుకే దాని నణగ గొట్టాలని కూడా ఒక మాట అంటున్నాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అర్జునా నీవు సవ్యసాచివే కావచ్చు. ఎడమ చేతితో కూడా అస్త్ర శస్త్రాలు ప్రయోగించ గలననే ధీమా ఉండవచ్చు. కాని అది కట్టిపెట్టు. నా దగ్గర అదేదీ చెల్లదు నీకు. కేవలం నీవొక నిమిత్త మాత్రుడవే. నా చేతిలో ఒక కీలుబొమ్మవే. నేనెటు ఆడిస్తే అటు ఆడవలసిన వాడవే గాని నీ స్వశక్తితోనే ఈ రాబోయే భారత యుద్ధంలో విజయం సాధించగలనని ఎప్పుడూ కలగనబోకు. అని కూడా హెచ్చరిస్తాడు. అంతే మరి. భ్రామయన్ సర్వాభూతాని యంత్రా రూఢాని మాయయా అని తరువాత 18వ అధ్యాయంలో రాబోతుంది. పిపీలికాది బ్రహ్మపర్యంతం ప్రతి ఒక్కరి లోపలా చేరి రంగులరాట్నంలో బొమ్మలు తిప్పినట్టు తిప్పుతున్నాడా ఈశ్వరుడు. దానికి కారణమాయన మాయాశక్తి. శక్తి ఆయన కధీనమైతే ఐశ్వరమైన ఆ మహాశక్తికి మానవు డధీనుడు. ఈశ్వర దయా దత్తమైనదే ఎవరికెంత శక్తి ఉన్నా. అది ఏ మార్గంలో పని చేస్తున్నా. ఆయన తప్ప చూస్తే అశక్తుడే ప్రతివాడూ. అకించిత్కరుడే.

ద్రోణం చ భీష్మంచ జయద్రథంచ
కర్ణం తధాన్యానపి యోధ వీరాన్
మయా హతాం స్త్వం జహి మా వ్యధిష్ఠాః
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ - 34

Page 427

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు