#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


తన ప్రణాళికలోనే ఉంటుంది. జరిగినదీ జరుగుతున్నదే గాదు. భవిష్యత్తులో జరగబోయేది కూడా. అదే చెబుతున్నాడిప్పుడు. ఋతే పిత్వా. నీవు లేకున్నా సరే అర్జునా. నీ అస్త్ర శస్త్రాలతో నిమిత్తం లేదు. నా సంకల్పమే బ్రహ్మాండమైన పాశుపతాస్త్రం. ఒక్కసారి ఇలా జరగాలని సంకల్పించానంటే చాలు. నభవిష్యంతి సర్వే. ఎవరూ మిగలరు. అందరూ నా క్రియాశక్తి కాహుతి అయిపోవలసిందే. ఎవరా అందరూ. యే వస్థితాః ప్రత్యనీ కేషు యోధాః - యుద్ధ భూమిలో ప్రవేశించి పోరాడటానికి సిద్ధంగా ఉన్న యోధ వీరులందరూ వారు కౌరవులే గాదు. పాండవులే గాదు. యాదవులే గాదు. ఎవరి మీద నా దృష్టి పడితే వారందరూ నామరూపాలు లేకుండా పోవలసిందే.

తస్మా త్త్వ ముత్తిష్ఠ యశోలభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం
మయై వైతే నిహతాః పూర్వమేవ
నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ 33


  అంచేత నీవిక మీన మేషాలు లెక్కపెట్టకుండా లేచికూచో. యుద్ధాని కుపక్రమించు. ఎలాగా ఇంతమంది మహావీరులతో పోరాడటమని సంకోచించకు. మయైవైతే నిహతాః పూర్వమేవ. నీకంటే ముందుగా నేనే వీరందరినీ వధించాను సుమా. కాలం తీరటమే వారందరినీ పరమాత్మ వధించటం. పరమాత్మే వధిస్తే ఇక అర్జునుడు మరలా పోరాడటం దేనికి.

Page 425

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు