#


Index

విశ్వరూప సందర్శన యోగము

నిస్తున్నాను. ఇదుగో నీవు కోరిన విశ్వరూపం చూపుతా నా దివ్య దృష్టితో చూడమన్న మాటే చివరి మాట. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మరి మాటాడలేదు పరమాత్మ. మౌనంగా తన విభూతిని చూపుతూ వచ్చాడు. పోతే ఏది మాటాడినా చేసినా అదంతా అర్జునుడు చేస్తూ వచ్చిన ప్రసంగమే. అది చూచి అతడు పడుతున్న భయాందోళనలే. కాగా ఎప్పుడైతే ఆయన ఉగ్రమైన రూపం చూడలేక చేతులెత్తాడో ఎవరయ్యా నీవని భయపడుతూ మొర పెట్టాడో ఇక లాభం లేదని బయటపడి మాటాడుతున్నాడు. అది కూడా అసలే అతడు భయపడుతుంటే దానినింకా ద్విగుణీకృతం చేస్తూ అంటున్నాడు. ఏమని. కాలోస్మి. నేనెవడినో తెలుసా అర్జునా. చెప్పమని అడిగావు గదా. చెబుతున్నాను విను. కాలస్వరూపుణ్ణి నేను. ఇక్కడ చమత్కారమే మంటే కాలమనేది కనపడదెవరికీ. దానికి రూపం లేదు. నిరాకారం. నిరాకారం కనుకనే అర్జునుడాయన విగ్రహాన్ని పోల్పుకోలేక గాబరా పడటం సహజమే. మరి కాలుణ్ణని ఎప్పుడన్నాడో ఇక ఆయన చేసే పనేమిటి. లోకక్షయ కృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః - లోకాలన్నింటి నీ ధ్వంసం చేయటానికే అవతరించాను. అహమే వాక్షయః కాలః అని ఇంతకు ముందు విభూతి యోగంలో చెప్పిన మాటే ఇక్కడ మళ్లీ చాటుతున్నాడు. తానే ఎప్పుడు కాల స్వరూపుడయ్యాడో ఇక కాలుడు వేరే లేదు. ఎవరినెప్పుడు తుదముట్టించాలో అప్పుడెవరి ప్రమేయమూ లేకుండా తానే స్వతంత్రంగా దాన్ని సాధించగలడు. అంతా

Page 424

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు