అయినా ఇలా అడుగుతున్నాడంటే అర్జునుడి కున్నట్టుండి మతి ఏమైనా భ్రమించిందా. పశ్యామి త్వా పశ్యామి త్వా మని అంతవరకూ దేవ దేవా నిన్నిలా చూస్తున్నా నలా చూస్తున్నానని ఎంతో తెలిసినట్టు కనిపించిన వాడిదేమి టున్నట్టుండి నీవెవరవో తెలియటం లేదు నాకు చెప్పమంటాడు. స్వరూప జ్ఞానం లేకుండా కేవల మాయన ప్రదర్శించే విశ్వరూపాన్ని మాత్రమే గుడ్లప్పగించి చూస్తూ వచ్చిన దోషమిది. అందుకే నిద్రలో కలవరించినట్టు కలవరిస్తున్నాడు. మనమెప్పుడైనా ఒంటరిగా ఒక ఇంట్లో కూచొని ఏదో ఆలోచిస్తుంటే కను చీకట్లో ఎవడో ఒక వ్యక్తి కండ్ల ముందు కదలిపోతుంటే అది ఎవడైనదీ తెలియక గాబరా పడి ఎవరక్కడ అని అడుగుతాము చూడండి. అలాటి గాబరా పడుతున్నాడర్జును డిప్పుడు. అందుకే విజ్ఞాతు మిచ్చామి. నీ జాడ నాకు స్పష్టంగా తెలియటం లేదు బయటపెట్టమని అంతగా ప్రాధేయపడుతున్నాడు భయంతో.
కాలో స్మి లో కక్షయ కృ త్ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతేపిత్వా న భవిష్యంతి సర్వే
యేవ స్థితాః ప్రత్యనీ కేషు యోధాః - 32
అర్జునుడిలా భయో ద్వేగంతో అడిగాడో లేదో అప్పుడు మాటాడసాగాడు కృష్ణ పరమాత్మ. అంతవరకూ నోరు తెరచి ఒక్కమాట మాట మాటాడిన వాడు కాదు. దివ్యం దదామి తేచక్షుః నీకు దివ్య దృష్టి
Page 423