#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


భావ్యర్థాన్ని ముందుగా సూచన చేస్తున్నా డర్జునుడికి. దీనిమూలంగా పాండవుల కవశ్యంగా రాబోయే యుద్ధంలో విజయం లభిస్తుందని హామీ ఇస్తున్నాడు పరమాత్మ. అందుకోసమే గదా వాడు భయపడుతున్నది.

  ఇంకా అతనికీ విషయంలో నమ్మకం కలిగే మరొక సందర్భం కూడా వర్ణిస్తున్నాడు వ్యాస మహర్షి యధా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః - పతంగమంటే ఇక్కడ మిడత అని అర్థం. పతన్ గచ్ఛతీతి పతంగః పడుతూ పడుతూ ముందుకు పోతుంది గాబట్టి పతంగమన్నారు దాన్ని. అవి ఎందుకు ముందుకు దూసుకుపోతుంటాయో వాటికే తెలియదు. అతి వేగంతో దూకుతుంటాయి ముందుకు. ఎక్కడికి. ఎర్రగా మండుతున్న అగ్నిహోత్రంలోకి. ఎందుకని అడుగుతావా. నాశాయ. చావటానికి. మాడి మసి అయిపోవటానికి. అంతకు మించి వేరే ప్రయోజనం లేదు వాటి దూకుడుకు. అలాగే ప్రస్తుత మీ మహా వీరులంతా అగ్నిజ్జ్వాలలాగా మండుతున్న నీ ముఖ గహ్వరంలో తమంత తాము వచ్చి దూకుతున్నారు - నామరూపాలు లేకుండా నశించిపోతున్నారంటే ప్రారబ్ధం వారి నెత్తిన ఎక్కి తొక్కుతున్నది. అలా కాకపోతే వారికీ యుద్ధం చేయాలనే బుద్ధి పుడుతుందా. అందులో చావటానికి సిద్ధమవుతారా. ఇదంతా రాబోయే సన్నివేశాన్ని ముందుగా నిదర్శనం చేసి చూపుతున్నాడు పరమాత్మ అర్జునుడికి. ఇక్కడ పేర్కొన్న రెండు పమానాలూ సాభిప్రాయమే. నదీ జలాలు అచేతనమైతే మిడుతల దండు చేతనం. చేతనమైనా అచేతనమైనా

Page 420

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు