నడచి పోతుంటారు కొంతమంది. ఎందుకు లేచారో తెలియదు. ఎక్కడికి వెళ్లుతున్నారో తెలియదు. ఏమి చేస్తుంటారో తెలియదు వారికి. అలాగే నిద్రలో నడచి వస్తున్నట్టు దయ్యం పట్టిన వారిలాగా వచ్చి పడుతున్నారు. నిజంగా పడుతున్నారా. అంటే లేదు మరలా. ఎందుకంటే అక్కడ ఉన్న ఇరుపక్షాల సైనికులూ వచ్చి వాస్తవంగానే ఆ విశ్వరూపుడి నోళ్లలో వచ్చి పడితే ఏమవుతుందా కురుక్షేత్రం. ఖాళీ అయిపోదూ. ఖాళీ అయితే మరి ఆ విశ్వరూప మపసంహరించిన తరువాత మళ్లీ భీష్మ ద్రోణాది మహా వీరులంతా వచ్చి యుద్ధ రంగంలో ఎలా హాజరయ్యారు. ఎక్కడి నుంచి వచ్చి కూచున్నారు. వారెవరూ అక్కడ లేకుండా భారత యుద్ధమెవరు చేశారు. ఎలా జరిగింది. కాబట్టి ఏమిటిదంతా. అప్పటికి వారాయన వక్త్ర బిలంలో నిజంగా ప్రవేశించి నశించి పోయారా. కాదు. వచ్చినట్టు ప్రవేశించినట్టు మరణించినట్టు అంతా ఒక భ్రమ. ఒక గారడీ. కృష్ణ గారడీ లేదా కృష్ణ రూపంలో ఉన్న పరమాత్మ గారడీ. ఏదీ జరగకపోయినా వాస్తవంగా జరిగినట్టు ప్రదర్శించటమే గదా గారడీ అంటే. అలాంటి బ్రహ్మాండమైన ఇంద్రజాలమిది. అసలు విశ్వరూపమే ఒక ఇంద్రజాల మయినప్పు డక్కడ చూస్తున్నదేది గాని వాస్తవమెలా అవుతుంది. అయితే ఎందుకిలా చూపుతున్నాడు. ఆ చూపటంలో ఆంతర్యమేమిటి. అప్పుడే పోయారని గాదీ వీరులంతా. త్వరలోనే పోవటానికి రెడీగా ఉన్నారు సుమా కాలం తీరింది వీరందరికీ. అది నీకు అతి త్వరలోనే తార్కాణ మవుతుందని
Page 419